ఎల్2: ఎంపురాన్ – తెలుగు సీక్వెల్‌పై మోహన్ లాల్ క్లారిటీ!

Share


మలయాళ సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం L2: Empuraan. లూసిఫర్Continuationగా రూపొందిన ఈ సినిమా మార్చి 27న గ్రాండ్‌గా విడుదల కానుంది. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో, పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ విజయం సాధిస్తుందనే నమ్మకంతో చిత్రబృందం ఉంది.

తెలుగు ప్రేక్షకులకు తెలిసిందే, లూసిఫర్ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ గా రీమేక్ చేయగా, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. మోహన్ లాల్ ఒరిజినల్ లూసిఫర్ ఇప్పటికే తెలుగులో విడుదల కావడం, ప్రేక్షకులను గాడ్ ఫాదర్ పై ఆసక్తి తగ్గించిందని సినీ వర్గాలు విశ్లేషించాయి.

సమీప కాలంలో తెలుగు ప్రమోషన్స్‌లో పాల్గొన్న మోహన్ లాల్‌కు ఓ జర్నలిస్ట్, “లూసిఫర్ తెలుగు రీమేక్ చూశారా?” అని ప్రశ్నించగా, ఆయన “అవును, చూశాను. కథలో కొన్ని మార్పులు చేశారు. కానీ నా ఎన్నో సినిమాలు రీమేక్ అయ్యాయి, ఇది కొత్త విషయం కాదు” అని సమాధానం ఇచ్చారు.

అదే సమయంలో, మోహన్ లాల్ మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. L2: Empuraan కు సీక్వెల్ గా రూపొందుతుండగా, గాడ్ ఫాదర్ కు మాత్రం సీక్వెల్ చేసే అవకాశం లేదని అన్నారు. లూసిఫర్ లో కీలక పాత్రల్లో ఒకటైన టోవినో థామస్ పాత్రను గాడ్ ఫాదర్ లో పూర్తిగా తొలగించడంతో, కథలో సీక్వెల్‌కు అవసరమైన కీలక మలుపులు మిస్ అయ్యాయని వెల్లడించారు.

ఇక L2: Empuraan ట్రైలర్ చూస్తే, టోవినో థామస్ పాత్ర సినిమా కథకు ప్రధానంగా మారినట్టు అనిపిస్తోంది. అందుకే, తెలుగు వెర్షన్‌కు సీక్వెల్ చేయడం అంత సులభం కాదని మోహన్ లాల్ అభిప్రాయపడ్డారని అర్థమవుతోంది.

ఇప్పటికే భారీ అంచనాలతో ఉన్న L2: Empuraan మలయాళంలో రికార్డులు తిరగరాయబోతుందా? తెలుగులోనూ మలయాళ వెర్షన్‌కు మంచి ఆదరణ దక్కుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.


Recent Random Post: