
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. చిన్న క్యారెక్టర్ రోల్స్‌తో కెరీర్ మొదలుపెట్టి, ఇప్పుడు టాప్ హీరోల లిస్టులో స్థానం సంపాదించుకున్నారు. వరుస బ్లాక్‌బస్టర్ సినిమాలతో అభిమానులను అలరించిన ఆయన, తన స్టైల్ అండ్ స్వాగ్‌తో ఎప్పుడూ యూనిక్‌గా కనిపిస్తుంటారు. ప్రస్తుతం సినిమాలు, బిజినెస్‌లు రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ బిజీగా ఉన్నారు.
ఇటీవల, నిర్మాత బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు విజయ్ అభిమానులను ఆగ్రహానికి గురి చేశాయి. తాను విజయ్ గురించి మాట్లాడలేదని గణేష్ వివరణ ఇచ్చినా, అభిమానులు నమ్మలేదు. కిరణ్ అబ్బవరం K-Ramp ఈవెంట్‌లో బండ్ల గణేష్ మాట్లాడుతూ — “కొంతమంది ఒకట్రెండు హిట్స్ కొడితే లూసు ప్యాంట్లు వేసుకుని, కళ్లజోడు పెట్టుకుని, ఓవర్ యాక్షన్ చేస్తారు” అని వ్యాఖ్యానించడంతో, ఆయన విజయ్‌నే టార్గెట్ చేశారని అభిమానులు భావించారు.
ఇలాంటి నేపథ్యంలో, ఇటీవల రష్మిక మందన్న నటించిన ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ సక్సెస్ మీట్‌లో ఎస్కేఎన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆయన వ్యాఖ్యలు బండ్ల గణేష్‌కి పరోక్ష కౌంటర్‌లా అనిపించాయి. విజయ్ కోసం స్టేజ్‌పై మాట్లాడుతూ, ఎస్కేఎన్ — “రాజు అప్పుడప్పుడు కనిపించకపోవచ్చు కానీ ప్రిన్స్ ప్రిన్సే. సింహం అడవిలో ఉన్నా, బోనులో ఉన్నా సింహమే” అని చెప్పి, విజయ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.
అలాగే, “విజయ్ పడే కష్టాలు నాకు తెలుసు. ఆయన లైనప్‌తో రాబోయే నెలల్లో బాక్సాఫీస్ షేక్ అవుతుంది. ఒక్కసారి కొడితే ఫ్లూక్ అంటారు, రెండోసారి కొడితే ఫేక్ అంటారు, మూడోసారి కొడితే ఇండస్ట్రీ షేక్ అంటారు” అంటూ పంచ్ డైలాగ్‌లతో ఫ్యాన్స్‌లో జోష్ నింపారు.
“విజయ్ దేవరకొండ అనే పేరు కనపడితే చాలు… టీజర్ లేక ట్రైలర్ లేకపోయినా ఓపెనింగ్ పగలిపోతుంది. అది ఆయన స్టామినా” అని ఎస్కేఎన్ చెప్పడంతో, సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్‌గా మారింది. ఇప్పుడు అందరి దృష్టి బండ్ల గణేష్‌పై ఉంది — ఆయన దీనికి ఏమైనా రియాక్ట్ అవుతారా అని.
Recent Random Post:















