
కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించి స్వయంగా దర్శకత్వం వహించిన ఎమర్జెన్సీ థియేట్రికల్ రన్లో ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, ఓటీటీలో విడుదలైన తర్వాత మంచి ప్రశంసలు అందుకుంటోంది. ఈ సినిమా పై ఇండస్ట్రీలో తొలుత ఉన్న ఊహాగానాలు, అంచనాలు ఎలా ఉన్నా, విడుదల అనంతరం ప్రేక్షకుల నుంచి చక్కటి స్పందన వచ్చింది.
ప్రముఖ దర్శకుడు సంజయ్ గుప్తా ఈ చిత్రాన్ని అభినందిస్తూ, తాను ముందుగా కంగనాను అంచనా వేయడంలో పొరపాటు చేసినట్లు ఒప్పుకున్నారు. ఆయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, “ఎమర్జెన్సీ అద్భుతమైన సినిమా. కంగనా నటన, దర్శకత్వం రెండూ టాప్ నాచ్ & వరల్డ్ క్లాస్. ఆమె ప్రతిభను సరైన సమయంలో గుర్తించలేకపోయానని అంగీకరిస్తున్నాను” అంటూ ప్రశంసించారు.
సంజయ్ గుప్తా వ్యాఖ్యలపై స్పందించిన కంగనా, తనపై పరిశ్రమలో ఉన్న పక్షపాత ధోరణిని గుర్తు చేసుకున్నారు. “నా గురించి ముందస్తు అంచనాలు లేకుండా సినిమాను చూస్తే, నిజమైన కంటెంట్ ఎలా ఉంటుందో అర్థమవుతుంది. అయితే, కొన్ని వర్గాలు నాపై ప్రతికూల అభిప్రాయాలతో ముందుగానే తీర్పు చెప్పేస్తుంటాయి” అని వ్యాఖ్యానించారు.
కంగనా తన సినిమాపై ఉన్న వివిధ అభిప్రాయాలను స్వీకరించినా, పరిశ్రమలో ఉన్న ద్వేషపూరిత పక్షపాతాలను దూరం పెట్టి, మంచి కృషికి గౌరవం ఇవ్వాలని కోరుకున్నారు. ఆమెను అర్థం చేసుకోవడానికి మునుపటి అంచనాలను పక్కన పెట్టి సినిమాను చూడాలని సూచించారు.
సంజయ్ గుప్తా తన ప్రతిభను గుర్తించినందుకు కృతజ్ఞతలు తెలిపిన కంగనా, “ఇలాంటి నిజాయితీతో స్పందించే వ్యక్తులు పరిశ్రమలో మరింత అవసరం” అంటూ అభిప్రాయపడ్డారు. ఎమర్జెన్సీ ఓటీటీలో మరింత ఆదరణ పొందుతుండటంతో, కంగనా తన పని తాను చేస్తున్నదనే నమ్మకంతో ముందుకు సాగుతోంది.
Recent Random Post:















