
విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న కింగ్ డమ్ సినిమా ఫలితంపై దిల్ రాజు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. “దిల్ రాజు ఈ సినిమా ప్రొడ్యూసర్ కాదు కదా?” అనిపించినా, దీనికి ప్రత్యేక కారణాలున్నాయి.
ఇటీవలి కాలంలో వరుస ఫ్లాపులతో తన బ్యానర్లో ఎప్పుడూ చూడని స్థాయిలో డౌన్ఫామ్లోకి వెళ్లాడు దిల్ రాజు. గేమ్ ఛేంజర్ లాంటి పెద్ద ప్రాజెక్ట్ ఆశించినంత ఫలితం ఇవ్వకపోవడం, తమ్ముడు శ్రీశిష్ట ప్రాజెక్ట్ కూడా అంచనాలను అందుకోకపోవడంతో ఆయనపై ఒత్తిడి పెరిగింది. ఇప్పుడు నితిన్‌తో ఎల్లమ్మ సినిమా, అలాగే విజయ్ దేవరకొండతో రౌడీ జనార్ధన్ సినిమాల మీదే హోప్స్ పెట్టుకున్నాడు.
ఇక ఈ నెల 31న థియేటర్లలోకి రానున్న కింగ్ డమ్ హిట్ అయితే, దాని ప్రభావం రౌడీ జనార్ధన్ మీద కూడా పడుతుంది. దీంతో ఆ సినిమాకు క్రేజ్ మరింత పెరిగి దిల్ రాజుకి లాభం చేకూరుతుందని టాక్. మరోవైపు కింగ్ డమ్ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో వస్తుండగా, నాగ వంశీతో దిల్ రాజుకి ఉన్న మంచి ర్యాపో కారణంగా నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఆయనదే అని తెలుస్తోంది. కాబట్టి, ఈ సినిమా హిట్ అయితే నేరుగా దిల్ రాజుకి బాక్సాఫీస్ బెనిఫిట్ దక్కుతుంది.
అందుకే రెండు కారణాల వలన ఈ సినిమా రిజల్ట్‌పై ఆయన దృష్టి పెట్టారు. గౌతం తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బజ్ బాగానే ఉంది. విజయ్ దేవరకొండకు కూడా ఈ హిట్ చాలా అవసరం, ఎందుకంటే ఆయనకు బాక్సాఫీస్‌లో సాలిడ్ హిట్ దాదాపు ఏళ్ల క్రితమే వచ్చింది.
మరి ఈ సారి కింగ్ డమ్‌తో విజయ్ దేవరకొండ బాక్సాఫీస్‌ని షేక్ చేస్తాడా? లేక ఫలితం వేరేలా ఉంటుందా? అన్నది గురువారం మొదటి షోతో తేలిపోనుంది.
Recent Random Post:















