కింగ్ తగ్గేదేలే.. ‘ది ఘోస్ట్’ రిలీజ్ డేట్ పై మేకర్స్ క్లారిటీ..!


కింగ్ అక్కినేని నాగార్జున నటించిన హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ ”ది ఘోస్ట్”. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 5వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీనికి తగ్గట్టుగా ప్రమోషన్స్ చేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు రిలీజ్ డేట్ విషయంలో నాగ్ ఆలోచనలో పడ్డారని.. దీనికి కారణం మెగాస్టార్ చిరంజీవి అని రూమర్స్ వచ్చాయి.

నాగ్ కెరీర్ లో కల్ట్ క్లాసిక్ గా నిలిచిన పాత్ బ్రేకింగ్ మూవీ ‘శివ’ విడుదల రోజైన అక్టోబర్ 5ను ”ది ఘోస్ట్” సినిమా కోసం లాక్ చేశారు. అయితే చిరంజీవి కథానాయకుడిగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గాడ్ ఫాదర్’ సినిమాను కూడా అదే రోజున థియేటర్లలోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. చిరంజీవి – నాగార్జున మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని దృష్టిలో పెట్టుకొని.. ‘ది ఘోస్ట్’ డేట్ ని ముందుకు జరిపారని పుకార్లు పుట్టుకొచ్చాయి.

అంతేకాదు నాగార్జున తన సినిమాని అక్టోబర్ 7న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారని వార్తలు వచ్చాయి. దీంతో అక్కినేని అభిమానుల్లో గందరగోళం ఏర్పడింది. ఈ నేపథ్యంలో దర్శకుడు ప్రవీణ్ సత్తారు ‘ది ఘోస్ట్’ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు. డేట్ మారిందనే వార్తలు నిజం కాదని.. ముందుగా ప్లాన్ చేసినట్లుగా విజయ దశమి సందర్భంగా అక్టోబర్ 5వ తేదీనే విడుదల అవుతుందని స్పష్టం చేసారు. దీంతో నాగ్ మూవీ రిలీజ్ రూమర్స్ కు చెక్ పడినట్లయింది.

కాగా ‘ది ఘోస్ట్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ముఖ్యంగా యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. ఇందులో ఇంటర్ పోల్ ఆఫీసర్ గా.. ఏజెంట్ విక్రమ్ గా నాగ్ కనిపించనున్నారు.

నాగార్జున కు జోడీగా సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటించింది. గుల్ పనాగ్ – అనిఖా సురేంద్రన్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇందులో నాగ్ ఉపయోగించే ఆయుధానికి కూడా కథలో ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది.

ఒక విలక్షణమైన సబ్జెక్ట్ తో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షించే కమర్షియల్ అంశాలతో.. స్టైలిష్ మేకింగ్ తో ‘ది ఘోస్ట్’ చిత్రాన్ని తెరకెక్కించారు ప్రవీణ్. పవర్ ఫుల్ యాక్షన్ తో పాటుగా ఫ్యామిలీ డ్రామా మరియు ఎమోషన్స్ కూడా ఉంటాయి.

మార్క్ కె రాబిన్ – భరత్ – సౌరబ్ వంటి ముగ్గురు సంగీత దర్శకులు సినిమాకు మ్యూజిక్ సమకూర్చారు. ముఖేష్ జి సినిమాటోగ్రఫీ అందించగ.. బ్రహ్మ కడలి ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. ఫైట్ మాస్టర్స్ దినేష్ సుబ్బరాయన్ మరియు కేచా యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు.

నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై భారీ ఎత్తున ‘ది ఘోస్ట్’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సునీల్ నారంగ్ – పుస్కుర్ రామ్ మోహన్ రావు – శరత్ మరార్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తారేమో చూడాలి.


Recent Random Post: