కుమార్తెకు పెళ్లి చేసినా త‌గ్గేదేలే!

యాక్ష‌న్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వ‌ర్య‌ని స్టార్ హీరోయిన్ చేయాల‌ని ఇండ‌స్ట్రీకి తీసుకొచ్చాడు. `ప‌ట్ట‌త్తు యానై` అనే త‌మిళ సినిమాతో లాంచ్ చేసాడు. ఆ త‌ర్వాత క‌న్న‌డ‌లో ప్రేమ బ‌ర‌హా అనే సినిమా చేయించాడు. అటుపై `సొల్లి విడ‌వ` అనే చిత్రం చేసింది. ఇవేవి ఐశ్వ‌ర్య రాయ్ కి ఆయా ఇండస్ట్రీలో కొత్త‌ అవ‌కాశాలు తెచ్చి పెట్టలేదు. దీంతో అక్క‌డ లాభం లేద‌నుకున్న అర్జున్ టాలీవుడ్ కి తీసుకొచ్చాడు. ఇక్క‌డ విశ్వ‌క్ సేన్ హీరోగా తానే డైరెక్ట‌ర్ గా ఓ సినిమా లాంచ్ చేసాడు.

అందులో కుమార్తెనే హీరోయిన్ గా ఎంపిక చేసాడు. త‌న కోసమే ఇక్క‌డ సినిమా మొద‌లు పెట్టాడు అన్న‌ది అందిర‌కీ తెలిసిందే. అయితే ఆ సినిమా విశ్వ‌క్ తో వివాదం కార‌ణంగా మ‌ధ్య‌లోనే ఆగిపోయింది. ఈ క్ర‌మంలో ఐశ్వ‌ర్యా అర్జున్ త‌మిళ న‌టుడు తంబిరామ‌య్య కుమారుడితో ప్రేమాయ‌ణం న‌డిపింది. విష‌యం ఇంట్లో చెప్పి ఒప్పించి అత‌డినే పెళ్లి చేసుకుంది. దీంతో కెరీర్కి ఇక పుల్ స్టాప్ పెడుతుంద‌ని అనుకున్నారంతా.

కానీ తాజాగా మ‌రో సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. `సీతా ప‌య‌నం` అనే క‌న్న‌డ సినిమా చేస్తుంది. ఇందులో ఉపేంద్ర బంధువు నిరంజ‌న్ అనే కుర్రాడు హీరోగా న‌టిస్తున్నాడు. ఈ చిత్రాన్ని కూడా అర్జున్ స్వీయా ద‌ర్శ‌క త్వంలో నిర్మిస్తున్నాడు. అయితే హీరోయిన్ అవ్వాలి అన్న‌ది ఐశ్వ‌ర్య డ్రీమ్ నా? లేక తండ్రి క‌లా? అన్న‌ది తెలియ‌దు గానీ కుమార్తె హీరోయిన్ అయ్యే వ‌ర‌కూ అర్జున్ మాత్ర‌వ విశ్ర‌మించేలా లేరు.

తెలుగులో మ‌ధ్య‌లో ఆగిపోయిన చిత్రాన్నే క‌న్న‌డ‌లో మ‌రో హీరోతో చేస్తున్నారా? లేక అది కొత్త క‌థ అన్న‌ది తెలియాల్సి ఉంది. మొత్తానికి యాక్ష‌న్ కింగ్ అలా త‌న వార‌స‌త్వాన్ని కుమార్తె రూపంలో వారస‌త్వాన్నికొన‌సాగిస్తున్నారు.


Recent Random Post: