కూలీ ఓవర్సీస్ రికార్డు డీల్!

Share


సూపర్ స్టార్ రజనీకాంత్ మరియు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కూలీ’ సినిమాపై దేశవ్యాప్తంగా అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మాస్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రం అన్ని ప్రధాన భాషల్లో ఒకేసారి విడుదల కాబోతుండటం విశేషం. ఇందులో రజనీ పాత్రను ఇప్పటివరకు ఎప్పుడూ చూడనట్టుగా మాస్ లుక్‌లో చూపించబోతున్నారు. మరోవైపు నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ షాహీర్, సత్యరాజ్, శ్రుతి హాసన్, జూనియర్ ఎంజీఆర్, రేబా మోనికా జాన్ లాంటి భారీ తారాగణం సినిమాకు మరింత హైప్‌ను తీసుకువచ్చాయి.

కథా నేపథ్యం కూడా ఆసక్తికరంగా ఉండబోతోంది. బంగారం స్మగ్లింగ్ మాఫియా నేపథ్యంలో కథ నడవనుందని సమాచారం. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ వీడియోకు ప్రేక్షకుల నుంచి భీభత్సమైన రెస్పాన్స్ వచ్చింది. అనిరుధ్ మ్యూజిక్, కేజీ వాల్యూ మాస్ విజువల్స్ సినిమాపై అంచనాలను పీక్స్‌కి తీసుకెళ్లాయి. ఆగస్ట్ 14న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుండటం విశేషం.

ఇక తాజాగా ఓవర్సీస్ మార్కెట్‌లో ఈ సినిమాకు గల క్రేజ్ బాహుబలి స్థాయిలో మారింది. అన్ని భాషల కలిపి ఓవర్సీస్ థియేట్రికల్ హక్కులు ఏకంగా రూ.81 కోట్లకు విక్రయమైనట్లు సమాచారం. ఇది కోలీవుడ్ చరిత్రలో ఓ రికార్డ్ స్థాయి డీల్‌గా నిలిచింది. ఈ డీల్ ద్వారా రజనీకాంత్ మాస్ క్రేజ్‌కు, లోకేష్ కనగరాజ్ మార్క్‌కు మరోసారి ముద్ర పడింది. ముఖ్యంగా USA, యూకే, ఆస్ట్రేలియా, మలేషియా వంటి ప్రధాన మార్కెట్లలో ‘కూలీ’కు భారీ డిమాండ్ ఉంది.

ఇంత భారీ స్థాయిలో ఓవర్సీస్ బిజినెస్ జరగడం రజనీ కెరీర్‌లోనే పెద్ద రికార్డుగా భావిస్తున్నారు సినీ విశ్లేషకులు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ నెలకొన్నప్పటికీ, ఓవర్సీస్ హక్కుల రికార్డు డీల్ ఈ హైప్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. అయితే సినిమా కలెక్షన్ల పరంగా ఎంత రికార్డులు సాధించినా, కంటెంట్ బలమే చివరికి విజయం అని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు.


Recent Random Post: