
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తాజా చిత్రం కూలీ భారీ అంచనాల మధ్య ఆగస్టు 14న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంతో గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించగా, సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున కీలక పాత్ర పోషించగా, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ప్రత్యేకమైన రోల్లో ఆకట్టుకున్నారు. శృతిహాసన్, సత్యరాజ్, ఉపేంద్ర, మహేంద్రన్ వంటి ప్రముఖ నటీనటులు కూడా ప్రధాన పాత్రల్లో కనిపించారు. యువ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందించారు.
రిస్టైల్ రోజే కూలీ బాక్సాఫీస్ వద్ద శభాష్ అనిపించుకున్నా, అంచనాలను పూర్తిగా అందుకోలేకపోయింది. అయితే స్టార్ క్యాస్టింగ్, లోకేష్ డైరెక్షన్ పవర్‌తో పాటు వరుస సెలవుల కారణంగా వసూళ్ల పరంగా బలమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. రిలీజ్ అయిన వారం రోజుల్లోనే ఈ చిత్రం రూ.430 కోట్లకు పైగా రాబట్టి, కమల్ హాసన్ – లోకేష్ కాంబినేషన్లో వచ్చిన విక్రమ్ (లైఫ్ టైమ్ రూ.420 కోట్లు) రికార్డును అధిగమించింది.
దీంతో కూలీ కోలీవుడ్ టాప్ గ్రాసర్స్ జాబితాలో ఆరో స్థానంలోకి ఎంట్రీ కొట్టింది. ప్రస్తుతం ఆ లిస్టులో 2.0, లియో, జైలర్, పొన్నియన్ సెల్వన్, ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ చిత్రాలు టాప్ 5లో ఉండగా, ఇప్పుడు వాటి వెంటనే కూలీ చేరింది.
గమనించదగ్గ విషయం ఏమిటంటే—ఇప్పటివరకు తమిళ సినీ ఇండస్ట్రీలో హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన ఆరు సినిమాల్లో మూడు రజినీకాంత్ వే కావడం. తలైవా నటించిన 2.0 టాప్‌లో ఉండగా, జైలర్ మూడో స్థానంలో ఉంది. ఇప్పుడు కూలీ కూడా ఆ జాబితాలో ఆరో స్థానాన్ని అందుకుంది. ఇక ఫుల్ రన్లో ఈ సినిమా మరెంత వసూళ్లు సాధించి, ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.
Recent Random Post:















