
తొలి సినిమా సూపర్‌హిట్ అయితే ఆ హీరోయిన్‌కి వచ్చే క్రేజ్ ఎంతైతే, అంతకంటే ఎక్కువ బాధ్యత కూడా ఉంటుంది. వచ్చీ రాగానే బ్లాక్‌బస్టర్ కొడితే, తర్వాత సినిమా ఇంకా మెరుగైనదై ఉండాలని ఒత్తిడి పెరుగుతుంది. అనుభవ లేమి వల్ల వచ్చిన ప్రతి అవకాశాన్ని చేసేస్తే, కొన్నాళ్లకే కెరీర్ దెబ్బతినే ప్రమాదం కూడా ఉంటుంది.
ఉప్పెనతో సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి పరిస్థితి కొంచెం ఇలాగే మారింది. తొలి సినిమా ఘనవిజయం తర్వాత కృతి స్పీడ్‌గా అరడజను సినిమాలు చేసింది. కానీ అవి పూర్తయ్యాక తాను కొన్ని తప్పులు చేసానని అంగీకరించింది. వరుస ఫ్లాప్‌ల కారణంగా ఆమెపై ట్రోలింగ్, నెగిటివ్ కామెంట్స్ భారీగా వచ్చాయి.
ఇప్పుడిట, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో కృతి ఈ విషయాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయింది. చాలా చిన్న వయసులో సినిమాల్లోకి రావడం, తొలి సినిమా బ్లాక్‌బస్టర్ అవ్వడం, ఆ తర్వాత వెంటవెంటనే ఫ్లాప్‌లు పడటం… ఇవన్నీ తక్కువ సమయంలో జరిగిపోవడంతో మానసిక ఒత్తిడి పెరిగిందని చెప్పింది.
“నేను నా బెస్ట్ ఇస్తున్నా… ఏదోలా విమర్శలు వచ్చేవే. ఈ సమయంలో అమ్మ, స్నేహితులు నాకు పెన్నుదన్నుగా నిలబడ్డారు” అని కన్నీళ్లు పెట్టుకుంది. చిన్న బ్రేక్ అవసరం అనిపించిందని కూడా చెప్పింది.
ఉప్పెన, శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు తప్ప తదుపరి వచ్చిన సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. దాంతో కృతి ఇప్పుడు కోలీవుడ్ వైపు మొగ్గు చూపింది. తమిళ్‌లో రవి మోహన్‌తో ‘జినీ’, ప్రదీప్ రంగానాథన్‌తో ‘LIK’, కార్తితో ‘అన్న గారు వస్తున్నారు’ వంటి చిత్రాల్లో నటిస్తోంది. ఈ సినిమాలతో తన సత్తా నిరూపిస్తే, తమిళ్‌లో మంచి మార్కెట్ పొందే అవకాశం ఉంది.
తెలుగులో ఇటీవల ఆఫర్లు తగ్గినా, అవకాశం వస్తే తాను టాలెంట్‌తో మళ్లీ రుజువు చేసుకోవాలనుకుంటుందనే విషయం కృతీ ఇంటర్వ్యూలో స్పష్టమైంది.
Recent Random Post:















