కోవిద్ సెకండ్ వేవ్ కారణంగా ప్రజలు ఎన్నో అవస్థలు పడుతున్నారు. కొందరు ప్రాణాలు కోల్పోతుంటే కొందరు ఆక్సిజన్ అందక, కొందరు హాస్పిటల్ బెడ్స్ దొరకక నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాలు తమ బాధ్యతను నెరవేరుస్తుంటే, స్వచ్చంద సంస్థలు తమ వంతు సాయాన్ని అందించడానికి ముందుకు వస్తున్నాయి.
సెలబ్రిటీలు సైతం తమకు తోచిన విధంగా సహాయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ కూడా కరోనా బాధితుల సహాయార్ధం ముందుకు వచ్చాడు. భారత్ స్కౌట్స్, గైడ్ హాల్స్ ను బీఎంసీ (బాంబే మున్సిపల్ కార్పొరేషన్) 20 బెడ్స్ హాస్పిటల్ గా మారుస్తుంది.
ఈ హాస్పిటల్ కావాల్సిన సామాగ్రిని అందించడానికి అజయ్ దేవగన్ తన ఎన్వై ఫౌండేషన్ ద్వారా నిధులను సమకూర్చాడు. అజయ్ దేవగన్ ఇలా కోవిద్ బాధితులకు అండగా నిలవడంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Recent Random Post: