
బాలీవుడ్‌కు సూపర్ హీరో ఫ్రాంచైజీగా పేరుగాంచిన క్రిష్ సిరీస్‌లో కొత్త కాపిటర్ మొదలవబోతోంది. హృతిక్ రోషన్ ప్రస్తుతం ఎన్టీఆర్‌తో చేస్తున్న వార్ 2 పూర్తయ్యాక, తాను స్వయంగా క్రిష్ 4 కి దర్శకత్వం వహించనున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ దాదాపుగా రెడీ అయిందని సమాచారం. మొదట ఈ ప్రాజెక్టుకు వేరే దర్శకుడ్ని అనుకున్నా, యష్ రాజ్ ఫిలింస్ అధినేత ఆదిత్య చోప్రా సలహాతో, హృతిక్ స్వయంగా డైరెక్ట్ చేయాలనే నిర్ణయం తీసుకున్నాడు.
ఇక ముంబయి వర్గాల్లో వినిపిస్తున్న లీక్స్ ప్రకారం, క్రిష్ 4 లో హృతిక్ ట్రిపుల్ రోల్ చేయనున్నాడట — హీరోగా, విలన్‌గా, ఇంకా ‘కోయి మిల్ గయా’ లోని తండ్రి పాత్రను కూడా తిరిగి తెరపైకి తీసుకువస్తారట. ఇది నిజమో కాదో తెలియదుగానీ, వినడానికి మాత్రం బాగుంది. మునుపటి భాగాల్లో నటించిన రేఖా, ప్రియాంక చోప్రా, వివేక్ ఓబెరాయ్, ప్రీతి జింటా వంటి వారు మళ్లీ కనిపించనున్నారు.
హీరోయిన్ ఎంపిక విషయంలో ఇంకా స్పష్టత లేదు. మొదట కియారా అద్వానీ పేరు వినిపించింది కానీ ఇప్పటికి ప్లాన్ మారినట్లు సమాచారం. నోరా ఫతేహీకి ఒక కీలక పాత్రలో అవకాశం దక్కినట్టు టాక్.
ఈసారి ప్రొడక్షన్ మరింత గ్రాండీయస్గా ఉండబోతుంది. బడ్జెట్ దాదాపు రూ.300 కోట్లకు పైగా కేటాయించే యోచనలో ఉన్నారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్, కల్కిలా విజువల్ ఎఫెక్ట్స్ ఆధారిత సినిమాలకు బాలీవుడ్ లో సరైన ప్రతినిధిగా క్రిష్ 4 నిలవాలని హృతిక్ చాలా పట్టుదలతో ముందుకెళ్తున్నాడు.
వార్ 2 పూర్తయ్యాక, పూర్తిస్థాయి సమయాన్ని క్రిష్ 4కే కేటాయించనున్నాడు. ఇతర దర్శకుల కథలపట్ల ఆసక్తి చూపకుండా, ఫోకస్ అంతా ఈ ప్రాజెక్టుపైనే పెట్టినట్టు తెలుస్తోంది. వేసవి తర్వాత షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. నటీనటుల డేట్లు ఖరారు అయిన వెంటనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.
Recent Random Post:















