‘క్రిష్ 4’కు హృతిక్ రోషన్ డైరెక్టర్‌గా మారనున్నాడా?

Share


ఇప్పటికే ‘క్రిష్ 4’ అధికారిక ప్రకటన వెలువడింది. ఈ ప్రాజెక్ట్‌ను మరింత ప్రతిష్టాత్మకంగా రూపొందించేందుకు రాకేష్ రోషన్ ఎంతో శ్రమిస్తున్నట్టు వెల్లడించారు. కథ, ప్రీ-ప్రొడక్షన్ పనులన్నీ పూర్తయ్యాయని, మునుపటి భాగాల కంటే మరింత గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. అయితే, బడ్జెట్ పరంగా కొన్ని సవాళ్లు ఉన్నా, ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని రూపొందిస్తామని స్పష్టం చేశారు.

ఇందులో మరో ముఖ్య విశేషం ఏంటంటే, *’కోయి మిల్ గయా’*లో అభిమానుల మనసుల్ని గెలుచుకున్న ‘జాదూ’ పాత్ర *’క్రిష్ 4’లో తిరిగి కనిపించబోతోందని హింట్ ఇచ్చారు. అంతేకాదు, ఈ సినిమా మొత్తం అంతరిక్షంలో జరగనున్న సైన్స్-ఫిక్షన్ అద్భుతంగా తెరకెక్కనుందని రాకేష్ రోషన్ వెల్లడించారు.

అయితే, ఇప్పటి వరకు డైరెక్టర్ ఎవరనే ప్రశ్నకు క్లారిటీ రాలేదు. రాకేష్ రోషన్ స్వయంగా దర్శకత్వం వహిస్తారా? లేక కొత్త దర్శకుడిని తెరపైకి తీసుకువస్తారా? అనే అనుమానాలు కొనసాగుతున్నాయి. ఇదే ప్రశ్నకు తాజాగా సంచలన సమాధానం లభించింది.

సినిమాకు డైరెక్టర్‌గా ఎవరు ఉంటారనేది ఇప్పుడు స్పష్టమైంది. ఈ చిత్రానికి హీరో హృతిక్ రోషన్ స్వయంగా దర్శకత్వం వహించనున్నాడు! ఆదిత్య చోప్రా, రాకేష్ రోషన్, హృతిక్ రోషన్ కలిసి జరిగిన మంతనాల అనంతరం హృతిక్ పేరు ఫైనల్ చేశారు.

ఇప్పటికే హృతిక్ నటనలో తన సత్తా చాటగా, ఇప్పుడు దర్శకుడిగా మారనున్నాడనే వార్త సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటి వరకు హృతిక్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టలేదనే విషయం తెలిసిందే. అయితే, తన ప్రొడక్షన్ హౌస్‌లో వివిధ చిత్రాల కోసం పలు విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది.

‘క్రిష్’ ఫ్రాంచైజీపై హృతిక్‌కు సంపూర్ణ అవగాహన ఉంది. అందుకే ఈ కొత్త ఛాలెంజ్‌ను స్వీకరించి హీరోగానే కాకుండా దర్శకుడిగానూ వ్యవహరించబోతున్నాడు. అయితే, హీరోగాను, డైరెక్టర్‌గాను ఒకేసారి పని చేయడం కత్తిమీద సామే. పైగా, సూపర్‌హీరో సినిమా కావడం వల్ల మరింత క్లిష్టమైన పని.


Recent Random Post: