చరణ్ కొత్త రిలీజ్ ప్లాన్.. రెగ్యులర్‌గా సినిమాలు!

Share


పాన్ ఇండియా హీరోగా రామ్ చ‌రణ్ దూసుకెళ్లిన త‌ర్వాత ఆయన సినిమాల లైన్‌ అప్‌లో పెద్ద మార్పే వచ్చింది. 2019 వ‌ర‌కు ప్రతి ఏడాది ఓ సినిమా రిలీజ్ చేసే టార్గెట్‌ పెట్టుకుని ముందుకెళ్లిన చ‌రణ్‌, ఆర్ ఆర్ ఆర్ త‌ర్వాత మాత్రం గ్యాప్‌లే ఎక్కువయ్యాయి. మూడేళ్ల గ్యాప్ త‌ర్వాతే గేమ్ ఛేంజర్ తో సోలో హీరోగా తెరపైకి వచ్చారు. మ‌ధ్యలో ఆచార్యలో కీల‌క పాత్ర, కిసీకా భాయ్ కిసీకా జాన్లో గెస్ట్ రోల్ చేసినా… సోలో సినిమాలకు మాత్రం భారీ విరామమే.

ప్రస్తుతం చ‌రణ్ పెద్ది సినిమా చేస్తున్నారు. ఇది వ‌చ్చే ఏడాది మార్చిలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. దాని వెంట‌నే సుకుమార్ సినిమా మొదలుపెట్టాల‌ని డిసెంబర్‌కే సెట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే చ‌రణ్ లైన్‌అప్‌ను మళ్లీ పాత ఫార్మాట్‌లోకి తీసుకెళ్లాల‌ని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఏడాదిన్న‌ర‌కు ఒక సినిమా అయినా ఖచ్చితంగా రిలీజ్ అయ్యేలా ప్లానింగ్ జరుగుతోంది.

పెద్ది త‌ర్వాత RC17 (సుకుమార్ సినిమా) మొదలవుతుంది. అది 2027లో రిలీజ్ చేసేలా సెట్ చేస్తున్నారు. దాని వెంటనే ప్ర‌శాంత్ నీల్ సినిమా ఫిక్స్ అవుతుందని సమాచారం. ఇది 2028కి రెడీ చేయాలని ప్లాన్. అలాగే త్రివిక్ర‌మ్‌, సందీప్ రెడ్డి వంగాలతో కూడా చర్చలు జరుపుతున్నాడట.

ప్రభాస్ లా బేక్ టు బ్యాక్ సినిమాలు చేసి వరుసగా రిలీజ్‌లు ఇవ్వాలన్నది చ‌రణ్ స్ట్రాటజీ అని ఫిల్మ్ నగర్ టాక్. మొత్తానికి వచ్చే ఏడాది నుంచి చ‌రణ్ తిరిగి రెగ్యులర్ గా సినిమా రిలీజ్‌ల్లో కనిపించనున్నారు.


Recent Random Post: