
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీలో ఉన్నారు. వశిష్ట్ దర్శకత్వంలో తెరకెక్కించిన విశ్వంభర షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. త్వరలో సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇక తర్వాత, దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో మరో ప్రాజెక్ట్‌ను చిరు ప్రకటించారు. ఈ సినిమాను నేచురల్ స్టార్ నాని సమర్పించనున్నాడు. సెట్స్‌పైకి వెళ్ళకముందే ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది.
ఇక ఇటీవల అనిల్ రావిపూడితో చేసే సినిమా పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
ఈ సందర్భంగా చిరంజీవి – రాజమౌళి కాంబినేషన్ గురించి మరోసారి చర్చ మొదలైంది. ఇప్పటి వరకు వీరిద్దరూ కలిసి పని చేయలేదు. అయితే, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చిరు ఈ విషయంపై స్పందించారు. “రాజమౌళి గారు తీసే సినిమాలు చాలాకాలం పాటు సాగుతాయి. 4–5 ఏళ్లు ఒకే ప్రాజెక్ట్‌కు డెడికేట్ అవ్వాల్సి వస్తుంది. నేను ఒకేసారి పలు సినిమాల్లో పని చేయడం వల్ల ఆ విధానం నాకు సరిపోదు” అని అన్నారు చిరు.
అలాగే, “రాజమౌళితో పని చేయకపోతే పాన్ ఇండియా స్థాయిలో నిరూపించుకోవాలన్న అవసరం నాకు లేదు” అంటూ స్పష్టంగా చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చిరు చేసిన వ్యాఖ్యలు నిజమేనన్నది అందరికీ అర్థమవుతుంది. రాజమౌళి గారి సినిమాలు ఎంత కాలం తీసుకుంటాయో తెలిసిందే. అదే సమయంలో చిరు వేగంగా సినిమాలు చేస్తూ వెళ్తారు. అందుకే ఇద్దరి వర్కింగ్ స్టైల్ వేర్వేరుగా ఉండడం వల్లే ఈ కాంబో ఇంకా మటేరియలైజ్ కాలేదన్నమాట!
Recent Random Post:















