చైతూ- శోభిత పెళ్లి.. సామ్ పైనే అందరి ఫోకస్!

హీరోయిన్ సమంత.. ప్రస్తుతం చాలా బాధలో ఉన్న విషయం తెలిసిందే. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు ఇటీవల మరణించారు. తండ్రి మరణంతో సామ్.. తీవ్ర విచారంలో మునిగిపోయారు. జోసెఫ్ మరణించిన తర్వాత హృదయం ముక్కలైన ఎమోజీ షేర్‌ చేశారు. నాన్నా.. మళ్లీ మనం కలిసేంత వరకు.. అంటూ తన ఆవేదనను పంచుకున్నారు. అయితే ఇన్ స్టాగ్రామ్ లో చాలా యాక్టివ్ ఉండే సమంత.. కొద్ది రోజులుగా మాత్రం సైలెంట్ గా ఉన్నారు.

తండ్రిని కోల్పోయిన బాధలో ఉన్న ఆమె.. పెద్దగా ఏం పోస్ట్ చేయడం లేదు. నాలుగు రోజుల నుంచి ఇన్ స్టా మెయిన్ ఫీడ్ ను షేర్ చేయలేదు. కానీ ఇన్ స్టా స్టోరీస్ ను మాత్రం క్రమం తప్పకుండా అప్డేట్ చేస్తూనే ఉన్నారు. ఫిట్ నెస్, హెల్త్ కు సంబంధించిన వివిధ విషయాలు ఇన్ స్టా స్టోరీస్ లో షేర్ చేస్తున్నారు సమంత. అదే సమయంలో నేడు (డిసెంబర్ 4వ తేదీన) తన మాజీ భర్త, హీరో నాగచైతన్య రెండో వివాహం చేసుకుంటున్న విషయం తెలిసిందే.

హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో మరికొద్ది గంటల్లో ఏడడుగులు నడవనున్నారు. హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో కొద్ది మంది సన్నిహితుల మధ్య చైతూ, శోభిత వివాహం జరగనుంది. స్టూడియోలోని ఏఎన్నార్ విగ్రహం ఎదుట ఏర్పాటు చేసిన వేదికపై శోభిత మెడలో చైతూ మూడు ముళ్లు వేయనున్నారు. కొంతకాలంగా ప్రేమలో ఉన్న వారిద్దరూ.. వేద మంత్రాల మధ్య ఒక్కటి కానున్నారు.

అయితే ఇప్పుడు చైతూ, శోభిత వివాహంపై సమంత ఏమైనా పోస్ట్ చేస్తారోమోనని చాలా మంది ఆసక్తిగా ఉన్నారు. విషెస్ చెబుతారోమోనని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు సామ్ స్పందించరని అంటున్నారు. ఇప్పటివరకు ఎప్పుడూ ఆమె చైతూ రెండో పెళ్లిపై రెస్పాండ్ అవ్వలేదని గుర్తు చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు కూడా సమంత ఎలాంటి పోస్ట్ పెట్టరని అంటున్నారు. అయితే సమంత విడాకుల తర్వాత తన పర్సనల్ తోపాటు కెరీర్ గ్రోత్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు.

అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మయోసైటిస్ బారినపడ్డ కోలుకున్న తర్వాత సమంత వరుస ప్రాజెక్టులతో బిజీ అవ్వాలని చూస్తున్నారు. ఇక సమంత డైరెక్ట్ గా కాకపోయినా తన గతం గురించి అప్పుడప్పుడు ఇన్ డైరెక్ట్ గా తీయక్ట్ అవుతూనే ఉంది. అలాగే ఏదైనా కొటేషన్స్ ఇస్తే వెంటనే అవి వైరల్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు సామ్ సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ పెట్టినా కూడా వైరల్ అవ్వడం పక్కా. కానీ సమంత ప్రస్తుతం తండ్రి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ తన కుటుంబంతో టైమ్ స్పెండ్ చేస్తోంది. అలాగే ఆమె బాలీవుడ్ లో త్వరలోనే మరో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Recent Random Post: