కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసులో భాగంగా రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఆయన కొరియోగ్రఫీ గాను జాతీయ అవార్డు కూడా వచ్చింది. కానీ ఆరోపణల నేపథ్యంలో ఆ అవార్దును రద్దు చేసారు. అవార్డు కోసం కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చినా? అవార్డు రద్దవ్వడంతో బెయిల్ క్యాన్సిల్ పిటీషన్ వేసారు. విచారణ నిమిత్తం జానీ మాస్టర్ జైలు నుంచి కోర్టుకు హాజరవుతున్నాడు.
ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ తో ఉన్న తమ అనుబంధాన్ని పలువురు కొరియోగ్రాఫర్లు పంచుకుంటున్నారు. తాజాగా మరో కొరియోగ్రఫర్ అనీ మాస్టర్ కూడా స్పందించారు. `జానీ మాస్టర్ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కష్టపడి పైకి వచ్చారు. ఇవాళ ఆయనకు ఎంతో పెద్ద కష్టం వచ్చింది. జానీ విషయంలో ఇప్పటికీ నేను షాక్ లోనే ఉన్నా. ఇలా జరిగింది అంటే నమ్మలేకపోతున్నాను. జానీ మాస్టర్ తో కలిసి చాలాసార్లు పనిచేసాను. కానీ నాతో ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించలేదు. ఒకవేళ బాధితురాలికి నిజంగా అన్యాయం జరిగితే ఆమెకు నా మద్దతు ఉంటుంది` అని అన్నారు.
అలాగే అంతకు ముందు మరో కొరియోగ్రాపర్ సందీప్ కూడా జానీ మాస్టర్ కి మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. `డ్యాన్స్ మాస్టర్స్ ఎంత కష్టపడతారో నాకు తెలుసు. ఒక సినిమా తీసుకొని.. హిట్ కొట్టి.. సక్సెస్ కొట్టి.. ఇంత చేసిన తర్వాత డ్యాన్స్ మాస్టర్‌కు లైఫ్ వస్తుంది. ఆయన ఎంత కష్టపడి ఉంటే నేషనల్ అవార్డు రేంజ్‍కు వెళ్లి ఉంటారు. నోటి దగ్గరి దాన్ని కాలితో తన్నేశారు. ఇది కరెక్ట్ కాదు. ఓ మనిషిని ఇలా సర్వనాశనం చేయడం తప్పు. జానీ మాస్టర్ కేసులో బాధితురాలిగా ఉన్న అమ్మాయి వేదన ఉంటే ఆయన దగ్గర అన్ని రోజులు పని చేయదు కదా అని ప్రశ్నించారు.
`ఆ అమ్మాయిని పని విషయంలో మేం కూడా పిలిచాం. కానీ జానీ మాస్టర్ దగ్గర మాత్రమే చేస్తానని చెప్పింది. అంత ఇబ్బంది ఉన్న అమ్మాయి మాస్టర్ దగ్గర స్థిరంగా చేయదు కదా. మనిషిని సర్వనాశనం చేయడం అనేది తప్పు. చట్టం కూడా ప్రస్తుతం మొత్తం అమ్మాయిల సైడ్ అయ్యే సరికి అంత సులువుగా అబ్బాయిల మీద కేసులు పెట్టి జీవితాలు నాశనం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు` అని ఓ వీడియో రిలీజ్ చేసాడు. అయితే ఆ వీడియో పై నెటి జనులు పెద్ద ఎత్తున మండిపడ్డారు.
Recent Random Post: