
బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఇప్పుడు పూర్తిగా టాలీవుడ్‌పైనే దృష్టి పెట్టింది. మొదటి సినిమా ఎన్టీఆర్‌తో ‘దేవర’ కాగా, రెండో ప్రాజెక్ట్‌గా రామ్‌చరణ్‌తో కలిసి ‘పెద్ది’ సినిమాలో నటిస్తోంది. వరుసగా బిగ్ ప్రాజెక్ట్స్ పట్టేసి సౌత్ ప్రేక్షకులకు మరింత చేరువ అవుతోంది. గ్లామర్‌తో పాటు కొత్త లుక్స్‌తో యూత్‌ను ఆకట్టుకుంటూ టాలీవుడ్‌లో క్రేజ్ పెంచుకుంటోంది.
ఇటీవల హైదరాబాద్‌లో జరుగుతున్న ‘పెద్ది’ సినిమా పాట చిత్రీకరణలో జాన్వీ పాల్గొంటున్నట్టు సమాచారం. ఈ క్రమంలో దర్శకుడు బుచ్చిబాబుతో కలిసి ఆమె ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సింపుల్ పింక్ జాకెట్, బ్లాక్ జీన్స్‌లో కనిపించిన జాన్వీ సింపుల్ లుక్‌లోనే అందాన్ని చాటేసిందని కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.
శుక్రవారం హైదరాబాద్లోని ఏఎంబీ సినిమాస్‌లో బుచ్చిబాబుతో కలిసి కనిపించడంతో, ఏ సినిమా ప్రివ్యూకు వచ్చారోనని నెటిజన్లు చర్చించుకున్నారు. కొందరు ‘హరి హర వీరమల్లు’ చూసారనగా, మరికొందరు వేరే సినిమా ప్రివ్యూ అని అంటున్నారు. ఏదేమైనా క్యాజువల్ లుక్‌లో జాన్వీ కనిపించడం యూత్‌కి పెద్ద ఆకర్షణగా మారింది.
ప్రస్తుతం ‘పెద్ది’ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ముఖ్యంగా కీలక సాంగ్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు. రామ్‌చరణ్ – జాన్వీ కపూర్ జోడీగా వస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తుండటం మరో హైలైట్. దివ్యేందు శర్మ, శివరాజ్‌కుమార్, జగపతిబాబు వంటి ప్రముఖులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో గ్రామీణ మాస్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా రామ్‌చరణ్ కెరీర్‌లో మరో హిట్‌గా నిలుస్తుందనే బజ్ నడుస్తోంది. జాన్వీ తక్కువ కాలంలోనే రెండు భారీ తెలుగు సినిమాలు సొంతం చేసుకోవడమే కాకుండా, పారితోషికం కూడా పెంచుకుంటూ టాలీవుడ్‌లో తన స్థానం బలపరుస్తోంది. ఇప్పుడు ఈ రెండో సినిమా విజయమే ఆమె భవిష్యత్తును నిర్ణయించనుంది.
Recent Random Post:















