
బాలీవుడ్లో గ్లామర్‌కు మరో పేరు అంటే అది జాన్వీ కపూర్. పూల్‌సైడ్ బికినీ ఫొటోలతోనూ, జిమ్-యోగా సెషన్లలో ఫిట్నెస్ ట్రాక్లతోనూ సోషల్ మీడియాలో హీటెక్కించే ఈ బ్యూటీ, ట్రెడిషనల్ లుక్స్‌లోనూ తనదైన ముద్ర వేస్తూ అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది.
ఇటీవల పింక్ చీరలో కన్పించిన జాన్వీ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కృష్ణకాంతమైన క్రిస్టలైన్ బార్డర్‌తో డిజైన్ చేసిన ఆ చీరను, పచ్చదనం కలిగిన క్రిస్టలైన్ బ్లౌజ్‌తో మ్యాచింగ్ చేస్తూ స్టైలిష్ లుక్‌ను చూపించింది. ఈ కాంబినేషన్ యువతలో మంచి క్రేజ్ తెచ్చుకుంది.
ఇంకా ప్రత్యేకత చెప్పాలంటే – ఆమె ధరించిన తెలుపు-మెరూన్ కలయికలో డిజైనర్ లారియట్ నెక్లెస్ అందరి చూపుల్ని కట్టిపడేసింది. చీరలతోనూ, లెహంగాల్లతోనూ ఈ తరహా జ్యూవెలరీ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. జాన్వీ లుక్ చూసినవాళ్లంతా ఈ ఫ్యాషన్‌ని ఫాలో అవుతున్నారు.
కెరీర్ విషయానికొస్తే – జాన్వీ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమాలో నటిస్తోంది. అలాగే, కోలీవుడ్ స్టార్ సూర్య సరసన కూడా ఓ భారీ ప్రాజెక్ట్‌లో నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
Recent Random Post:














