జూన్ 10 బాలయ్య ఫ్యాన్స్‌కు మాస్ ఫెస్టివల్

Share


బాలకృష్ణ పుట్టినరోజుకి డబుల్ ధమాకా: ‘అఖండ 2’ టీజర్ – కొత్త సినిమాకు ప్రకటన

టాలీవుడ్ సింహం నందమూరి బాలకృష్ణ ప్రతి సంవత్సరం తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ప్రత్యేకమైన సినీ కానుకను అందించే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా, జూన్ 10న జరగబోయే ఆయన పుట్టినరోజున రెండు భారీ అప్‌డేట్లు రెడీగా ఉన్నాయని పరిశ్రమ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

మొదటి గిఫ్ట్‌గా, బాలకృష్ణ–బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘అఖండ 2’ టీజర్ విడుదల కానుంది. ఇప్పటికే రెండు షెడ్యూళ్లు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. డైరెక్టర్ బోయపాటి టీజర్ కోసం ప్రత్యేకమైన కాన్సెప్ట్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. పాన్ ఇండియా స్థాయిలో ప్రభావాన్ని చూపే విధంగా టీజర్‌ను విజువల్ గ్రాండియర్‌తో ప్లాన్ చేస్తుండటం చిత్ర బృంద లక్ష్యంగా పెట్టుకుంది.

ఇక రెండో సర్‌ప్రైజ్‌గా, బాలయ్య తన తదుపరి కొత్త ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించబోతున్నాడు. ‘వీరసింహారెడ్డి’ విజయానికి తర్వాత మళ్లీ దర్శకుడు గోపీచంద్ మలినేనితో కలిసి బాలయ్య పని చేయనున్నట్లు తెలుస్తోంది. గోపీచంద్ ఇటీవల బాలీవుడ్ హీరో సన్నీ డియోల్‌తో ‘జాట్’ సినిమాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ జోష్‌లో బాలయ్యతో మరో మాస్ యాక్షన్ డ్రామాను ప్లాన్ చేస్తున్నాడు.

ఈ ప్రాజెక్టును వృద్ధి సినిమాస్ నిర్మించబోతుండగా, మరో ప్రముఖ నిర్మాణ సంస్థ కూడా భాగస్వామిగా ఉండనుందని సమాచారం. బాలకృష్ణ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కబోయే ఈ చిత్రాన్ని 2026 వేసవిలో విడుదల చేసే ప్లాన్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక గత కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్న డైరెక్టర్ హరీష్ శంకర్తో బాలయ్య సినిమా విషయంపై స్పష్టత వచ్చింది. ఈ కాంబినేషన్ వర్క్ అవుట్ అయ్యే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయని ఇండస్ట్రీ వర్గాలు తెలియజేస్తున్నాయి.

బాలయ్య అభిమానులకు ఈ పుట్టినరోజు రెండు విశేషమైన గిఫ్ట్‌లతో మెమొరబుల్‌గా మిగిలిపోనుంది.


Recent Random Post: