టాప్ స్టార్ పై భార్య ఆరోపణ: తిండి లేదు.. బాత్రూమ్ లేదు.. సీసీ కెమెరాల్లో బంధించాడు!

ఆలితో పెట్టుకుంటే ఎవరైనా అలుసైపోతారు! ఇప్పుడు బాలీవుడ్ ప్రముఖ హీరోపై ఇవే ఆరోపణలు..!! టాప్ స్టార్ పై భార్య ఆరోపణలు ఇప్పుడు బాలీవుడ్ ని పట్టి కుదిపేస్తున్నాయి.

ఇంతకీ ఎవరా ప్రముఖ నటుడు? అంటే.. పాపులర్ హీరో నవాజుద్దీన్ సిద్ధిఖీ. ఊపిరి పీల్చుకోవడానికి క్షణమైనా తీరిక లేనంత బిజీ ఆర్టిస్టు. అంతకుమించి బహుముఖ ప్రజ్ఞతో ట్యాలెంటెడ్ నటుడిగా నవాజుద్దీన్ గురించి ప్రజలకు పరిచయం చేయనవసరం లేదు. కానీ అతడు తన భార్యకు ఊపిరి తీసుకునే టైమ్ ఇవ్వడం లేదని ఆరోపణలు వచ్చాయి.

ఇంట్లో తనను వేధిస్తున్నారని నవాజుద్దీన్ భార్య ఆలియా సిద్ధిఖీ ఇటీవల ఆరోపించారు. తాజాగా నవాజుద్దీన్ సిద్ధిఖీ అతని కుటుంబ సభ్యులపై పలు కేసులు నమోదవుతున్నాయని ఆమె లాయర్ వెల్లడించారు. నవాజుద్దీన్ అతని కుటుంబ సభ్యులు తన క్లయింట్ కు తిండి పెట్టలేదని..మంచంపై చోటివ్వలేదని అలాగే బాత్రూమ్ కి కూడా వెళ్లనివ్వలేదని ఆలియా తరపు న్యాయవాది ఆరోపించారు.

లాయర్ ఇంకా చాలా ఆరోపణలతో ముందుకొచ్చారు. వారు నా క్లయింట్ (ఆలియా) చుట్టూ అనేకమంది మగ అంగరక్షకుల(సెక్యూరిటీ)ను కూడా వలయంలా ఉంచారు. నా క్లయింట్ ప్రస్తుతం ఆమె మైనర్ పిల్లలతో ఉంటున్న హాల్ లో CCTV కెమెరాలను అమర్చారు. ఆలియా నిరాడంబరతను పోలీసు అధికారుల ముందు అవమానించారు… అని ఆరోపించారు. మైనర్ కొడుకు చట్టబద్ధత ప్రశ్నించబడిందని ఆలియా తరపు న్యాయవాది పేర్కొన్నారు.

నవాజుద్దీన్ సిద్ధిఖీ అతని భార్య ఆలియా సిద్ధిఖీతో గందరగోళ రిలేషన్ షిప్ ఇటీవల తరచుగా మీడియా హెడ్ లైన్స్ లోకొస్తోంది. నవాజ్ తమ స్వగృహంలోనే తనను వేధించారని ఆలియా పేర్కొన్న కొద్ది రోజుల తర్వాత ఆమె లాయర్ ఇప్పుడు షాకింగ్ విషయాలు వెల్లడించారు. నవాజుద్దీన్ భార్య తరపు న్యాయవాది తన క్లయింటును ఇంటి నుండి గెంటేసేందుకు ప్రయత్నించారని తన ప్రతి కదలికను నియంత్రించారని ఆరోపించారు. లాయర్ సుదీర్ఘ ప్రకటనలో ఆలియా ఎదుర్కొంటున్న అవమానాల ఫర్వం గురించి వివరించారు.

రిజ్వాన్ సిద్ధికీ (ఆలియా లాయర్) విడుదల చేసిన ఒక ప్రకటన సారాంశం ఇలా ఉంది. “మిస్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ అతని కుటుంబ సభ్యులు ఆలియాను ఇంటి నుండి గెంటేసేందుకు ప్రతిదీ చేసారు. వారు ఆమెపై అక్రమాస్తులను కలిగి ఉందని నేరారోపణను దాఖలు చేశారు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసి వారు ఆమెను అరెస్టు చేయిస్తామని బెదిరించారు. ప్రతిరోజూ సూర్యాస్తమయం తర్వాత ఆమెను పోలీస్ స్టేషన్ కు పిలుస్తున్నారు“ అని కూడా లాయర్ పేర్కొన్నారు.


Recent Random Post: