
బాలీవుడ్లో ప్రాంచైజీ సినిమాల జోరు కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో, డాన్ 3 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో షారుఖ్ ఖాన్ నటించిన డాన్ సిరీస్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో డాన్ 3 రూపొందుతుండగా, ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి మరింత పెరిగింది.
ప్రాథమికంగా కియారా అద్వానీని రణవీర్‌కు జోడిగా ఎంపిక చేసినట్టు అధికారిక సమాచారం వెలువడింది. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ నుండి కియారా తప్పుకున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ ప్రారంభంలో జాప్యం చోటుచేసుకోవడం, ఆమె గర్భవతిగా మారడం ఈ నిర్ణయానికి కారణంగా చెబుతున్నారు.
కియారా మాతృత్వ విరామం తీసుకోవాల్సిన అవసరం ఉండడంతో, మేకర్స్ ఆమె స్థానంలో మరో నాయికను ఎంపిక చేయాలని భావిస్తున్నారు. విశ్వసనీయ వర్గాల ప్రకారం, ప్రస్తుతం బాలీవుడ్లో ఫుల్ బిజీగా ఉన్న కృతి సనన్ ఈ ప్రాజెక్ట్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
డాన్ 3 షూటింగ్ వచ్చే ఏడాది ఆరంభంలో మొదలవ్వనుంది. ఆ సమయానికి కియారాకు పాల్గొనలేని పరిస్థితులు ఉండే అవకాశం ఉండడంతో, డాన్ 3 వంటి భారీ సినిమాను ఆమె మిస్ అవడం కెరీర్ పరంగా ఓ పెద్ద మైలు రాయిగా మిగిలే అవకాశముంది. కియారా తిరిగి సినిమాల్లోకి 2027 తర్వాతే రావచ్చని సమాచారం. అయితే ఆమె మాత్రం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.
Recent Random Post:















