
కేజీఎఫ్ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ఇప్పుడు అసలైన మాస్ హీరో ఎన్టీఆర్‌తో కలసి ‘డ్రాగన్’ అనే భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, ఫ్యాన్స్‌కి ఇది అసలైన ఫెస్టివల్ అనేలా హైప్ ఏర్పడింది.
ప్రశాంత్ నీల్ ఎప్పుడూ హీరోల ఎలివేషన్‌ను ప్రత్యేకంగా చూపించడంలో దిట్ట. ఇప్పుడు ఎన్టీఆర్ లాంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోతో చేస్తున్న ఈ సినిమాలో తారక్ మాస్ ఎలివేషన్ సీన్లు మరో స్థాయిలో ఉండబోతున్నాయట. ఫ్యాన్స్ మూడు నాలుగు సార్లు సినిమాను చూస్తారనే నమ్మకంతోనే ప్రాజెక్ట్ ముందుకెళ్తోంది.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్ కేటాయించారని సమాచారం. ఎన్టీఆర్ రెమ్యూనరేషన్‌తో పాటు లాభాల్లో 25 శాతం షేర్ తీసుకునేలా డీల్ కుదిరిందట. లేకపోతే కనీసం ఒక ఏరియాలో ప్రాఫిట్ షేర్ ఇచ్చేలా చర్చలు జరిగాయని టాక్.
ఇక ప్రశాంత్ నీల్ కూడా ఈ సినిమాకు రెగ్యులర్ రెమ్యూనరేషన్ కంటే ఎక్కువగా డిమాండ్ చేశారని తెలుస్తోంది. ప్రాఫిట్‌లో 50 శాతం వరకు షేర్ అడిగారని, అది ఏ ఏరియాలోనో త్వరలో స్పష్టత రానుంది. అయితే, నీల్ చేసే కృషి, విజన్ బట్టి ఆ డిమాండ్ జస్ట్‌ఫై చేయబడుతుందనే భావన ఉంది.
ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తున్నారు. ఆమెకు కూడా ఇది మంచి లాంచింగ్ అవుతుందని అంచనా. ‘డ్రాగన్’ 2026 సమ్మర్ లేదా సెకండ్ హాఫ్‌లో విడుదల కానుంది. అయితే ప్రశాంత్ నీల్ ఈ సినిమాను ‘కేజీఎఫ్’, ‘సలార్’ తరహాలో రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నారా, లేక ఒకే భాగంగా ఫినిష్ చేస్తున్నారా అన్నది ఆసక్తికరంగా మారింది.
Recent Random Post:















