తమిళనాడులో ఫెయిల్ అయిన ‘కుబేర’, తెలుగులో హిట్!

Share


తమిళ స్టార్ హీరో ధనుష్‌కు తెలుగు ప్రేక్షకులంటే ప్రత్యేక మక్కువ. వెంకీ అట్లూరితో చేసిన ‘సార్’ సినిమాతో తెలుగు మార్కెట్‌లో అతడికి క్రేజ్ రెట్టింపయింది. ఆ చిత్రం రెండు భాషల్లోనూ మంచి హిట్‌గా నిలిచింది. ఇటీవల ఆయన నటించిన ‘రాయన్’ తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి, కెరీర్‌లో అత్యధిక గ్రాసింగ్ కలిగిన చిత్రంగా నిలిచింది.

ఈ హై మీదే ధనుష్, టాలెంటెడ్ తెలుగు దర్శకుడు శేఖర్ కమ్ములతో కలసి ‘కుబేర’ అనే సినిమాతో వచ్చారు. ప్రోమోలు ఆకట్టుకున్నాయ్, ఫస్ట్ డే టాక్ కూడా బాగుండడంతో తెలుగు రాష్ట్రాల్లో సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. వీకెండ్‌లోనూ వసూళ్లు బాగా నమోదయ్యాయి. తెలుగు వెర్షన్ రెండో వారం లో కూడా ‘కన్నప్ప’ వంటి పోటీతత్వ సినిమాతో సమంగా నిలిచి తన సత్తా చాటుతోంది.

అయితే, ఆశ్చర్యకరంగా, ఈ సినిమా ధనుష్ సొంతగడ్డ అయిన తమిళనాడులో మాత్రం ఆశించిన స్థాయిలో ఆడట్లేదు. రిలీజ్‌కి ముందే అడ్వాన్స్ బుకింగ్స్ డల్లుగా ఉండడంతో ఆశ్చర్యం కలిగించాయి. మొదటి రోజు ఓకే అనిపించినా, తర్వాత బాక్సాఫీస్ వద్ద సినిమాకు బ్రేకులు పడ్డాయి.

ఇదే చిత్రం చెన్నైలోనూ తెలుగు వెర్షన్‌తో మంచి ఆక్యుపెన్సీ దక్కించుకుంటోంది. మల్టీప్లెక్స్‌లలో తెలుగు వెర్షన్‌కు హౌస్ ఫుల్ పడుతుంటే, అదే థియేటర్లలో తమిళ వెర్షన్‌కు కేవలం 10-20% ఆక్యుపెన్సీ మాత్రమే కనిపిస్తోంది. ఓ తమిళ స్టార్ హీరోకి చెన్నైలో కూడా ఇటువంటి పరాభవం ఎదురవ్వడం నిజంగా షాకింగ్.

ధనుష్‌ వంటి నటుడు వైవిధ్యమైన పాత్రలు పోషిస్తే తమిళ ప్రేక్షకులు మరింత ఆదరిస్తారని నమ్మకం. శేఖర్ కమ్ముల సినిమా అయినా, కథనంలో తమిళ టచ్ ఉందని అర్థమవుతుంది. అయినా ఈ సినిమా అక్కడ ఎందుకు పనిచేయలేదు అన్నది ఇప్పుడు పరిశీలనీయమైన ప్రశ్న. ‘కుబేర’ తమిళనాట ఫెయిలవడం కంటే, ధనుష్‌కు ఇది నిజంగా తలనొప్పిగా మారిన షాక్ అని చెప్పొచ్చు.


Recent Random Post: