
నేచురల్ స్టార్ నాని కెరీర్ ప్రస్తుతం పీక్‌లో కొనసాగుతోంది. దసరా హిట్ తర్వాత వరుసగా భారీ ప్రాజెక్ట్స్‌లో భాగమవుతూ, తన స్థానాన్ని మరింత బలపర్చుకుంటున్నాడు. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే మరికొన్ని ప్రాజెక్టులను ఓకే చేస్తూ దూసుకుపోతున్నాడు. అలాగే, తన వాల్ పోస్టర్ సినిమా సంస్థ ద్వారా నిర్మాతగా కూడా సినిమాలు నిర్మిస్తూ బిజీగా ఉన్నాడు. ఇందులో నానికి సోదరి గంటా దీప్తి పూర్తి సహకారం అందిస్తోంది.
నాని ప్రొడక్షన్ విభాగానికి సంబంధించిన పనులు దీప్తి చూసుకుంటున్నారు. అంతేకాదు, మీట్ క్యూట్ సినిమాతో దర్శకురాలిగా కూడా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. అయితే, ఆ సినిమా తర్వాత మరో ప్రాజెక్ట్‌ను డైరెక్ట్ చేయలేదు. దీనిపై తాజాగా ఓ ఆసక్తికర చర్చ మొదలైంది. ఇంట్లో నాని హీరోగా ఉంటే, అక్కా-తమ్ముడు కాంబినేషన్లో ఓ సినిమా చేయొచ్చు కదా? అనే ప్రశ్న అభిమానుల్లో వినిపిస్తోంది.
అయితే, దీప్తి దీనిపై క్లారిటీ ఇచ్చింది. “నాని ఛాన్స్ ఇచ్చినా, నేను మాత్రం తమ్ముడితో సినిమా చేయను. మీట్ క్యూట్ తర్వాత కొన్ని కథలు సిద్ధం చేసుకున్నాను. భవిష్యత్తులో అవి తెరపైకి వస్తాయి. కానీ, వాటిలో ఎక్కడా నాని నటించడు. తమ్ముడితో సినిమా చేసే ఆలోచన నాకు లేదు. నాని అవకాశం ఇచ్చినా, నేను తీసుకోను. అక్కా-తమ్ముడు ఒకే సినిమా సెట్స్‌లో ఉండకూడదని భావిస్తున్నాను” అని ఆమె నవ్వుతూ చెప్పింది.
ప్రస్తుతం కోర్టు సినిమాకు కో-ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్న దీప్తి, ఈ ప్రాజెక్ట్ కోసం అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చింది. ఆరు నెలల పాటు పనులు చూసుకున్నానని, నాని, ప్రశాంతి తనకు కావాల్సిన స్వేచ్ఛను ఇచ్చారని ఆమె పేర్కొంది. “కోర్టు సినిమాను అనుకున్న బడ్జెట్లోనే పూర్తి చేశాం. నాని కథపై గట్టి నమ్మకం పెట్టుకున్నాడు. కోర్టు హిట్ కాకపోతే తన ‘హిట్ 3’ సినిమాను చూడొద్దని కూడా అన్నాడు”, అంటూ ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
Recent Random Post:















