తల్లికాబోతున్న లావణ్య సినిమా కెరీర్‌పై సందేహాలు

Share


మెగా ఫ్యామిలీ కోడలు లావణ్య త్రిపాఠి, 2023 నవంబరులో వరుణ్ తేజ్‌ను వివాహం చేసుకున్న తర్వాత వెండితెరపై కనిపించలేదు. సినిమాలకు విరామం ఇచ్చిన ఆమె, ఓటీటీ వెన్యూలపై వెబ్ సిరీస్‌ల ద్వారా మాత్రమే కనిపించి ప్రేక్షకులను అలరించింది. అయితే, పెద్ద తెరపై మాత్రం ఇప్పటివరకు ఆమె ఎలాంటి ప్రాజెక్టులోనూ కనిపించలేదు.

ఇటీవల లావణ్య త్రిపాఠి తన గర్భధారణ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. వచ్చే ఏడాది ఆమె తల్లిగా మారనున్న నేపథ్యంలో, ఆమె సినిమా కెరీర్ కొనసాగుతుందా లేదా అన్నదానిపై సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

లావణ్య కెరీర్ ఆరంభం నుంచే గ్లామర్ పాత్రల‌కు దూరంగా, డీసెంట్ రోల్స్ మాత్రమే చేస్తూ, తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందింది. పలుచోట్ల ఫ్లాపులు ఎదురైనా, తన విలువలతో రాజీపడకుండా నిబంధనలు పాటిస్తూ ప్రయాణం కొనసాగించింది.

లావణ్య కుటుంబం న్యాయవాదులు, న్యాయమూర్తుల వర్గానికి చెందడం వల్ల చిన్నప్పటి నుంచే క్రమశిక్షణ అలవాటైంది. అదే క్రమశిక్షణతో ఆమె పెళ్లి తర్వాత కూడా జీవనం సాగిస్తోంది. ప్రస్తుతం తాను ఇంటికే పరిమితమై ఉండగా, పెళ్లికి ముందు కమిట్ అయిన కొన్ని సినిమాల షూటింగ్ పూర్తై రిలీజ్‌కి సిద్ధమవుతున్నాయి.

తమిళంలో ‘తానల్’ అనే సినిమా పూర్తయి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. అలాగే ‘సతీ లీలావతి’ అనే మరో చిత్రం కూడా రూపొందుతోంది. ఈ రెండు సినిమాల విడుదల అనంతరం లావణ్య తన కెరీర్‌ను కొనసాగిస్తుందా, లేక పూర్తిగా గ్యాప్ తీసుకుంటుందా అన్న దానిపై స్పష్టత రానుంది.


Recent Random Post: