
సినీ ఇండస్ట్రీలోని స్టార్ కపుల్స్ పెళ్లయ్యాక పుణ్యక్షేత్రాలు దర్శించుకోవడం సాధారణం. అయితే ఇటీవల నాగచైతన్య తన భార్య శోభిత ధూళిపాళ్లతో కలిసి తిరుమల దర్శనం చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
సమంతతో విడాకుల తర్వాత శోభితను డేటింగ్ చేసి, గత సంవత్సరం డిసెంబర్లో అన్నపూర్ణ స్టూడియోలోని ఏఎన్ఆర్ విగ్రహం ముందు నాగచైతన్య, శోభిత పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత బిజీగా సినిమాలతో సక్సెస్ ట్రాక్‌లో ఉన్న నాగచైతన్య, టైమ్ కేటాయించి భార్యతో కలిసి తిరుమల పుణ్యక్షేత్రానికి వెళ్లారు.
వైరల్ అవుతున్న వీడియోలో నాగచైతన్య పట్టు వస్త్రాల్లో సంప్రదాయంగా కనిపించగా, శోభిత ఎరుపు చీరలో అచ్చ తెలుగు ఆడపిల్లలా దర్శనమిచ్చింది. నుదుటి బొట్టు, చేతులలో గాజులు, తలపాగా సింధూరంతో ఆమె సింప్లిసిటీ అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా వీరిద్దరూ సామాన్య భక్తుల్లా క్యూ లైన్లో నిల్చొని దర్శనం చేయడం నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది. “స్టార్స్ అయినా జంటలో ఏమాత్రం అహం కనిపించడం లేదు” అంటూ చాలామంది పొగడ్తలు కురిపిస్తున్నారు.
మరోవైపు నాగచైతన్య సినిమాల విషయానికొస్తే, ‘తండేల్’ హిట్ తర్వాత ప్రస్తుతం కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో NC24 వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో హీరోయిన్గా శ్రీలీల, పూజా హెగ్డే పేర్లు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా యువసుధ ఆర్ట్స్ బ్యానర్లో మరో కొత్త ప్రాజెక్ట్ చేయబోతున్నట్టు సమాచారం.
శోభిత విషయానికి వస్తే, తమిళ దర్శకుడు పా. రంజిత్ తెరకెక్కిస్తున్న ‘వెట్టవం’ మూవీలో ఆమె నటిస్తున్నట్టు టాక్. అదేవిధంగా సురేష్ ప్రొడక్షన్స్‌లో లేడీ ఓరియంటెడ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌లో కూడా నటించబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
Recent Random Post:















