త్రిష ఒక్క పోస్ట్.. విజయ్ ఫ్యాన్స్ ఫుల్ ఫైర్! ఏం జరిగింది?

సీనియర్ హీరోయిన్ త్రిష.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. మణిరత్నం పొన్నియన్ సెల్వన్ మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ.. వరుస చిత్రాలను లైన్ లో పెడుతోంది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర మూవీలో యాక్ట్ చేస్తోంది. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. అజిత్ కుమార్ విడా మయురచ్చిలో ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది త్రిష.

వీటితోపాటు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ది గోట్ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్)లో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. సైంటిఫిక్ డ్రామాగా వెంకట్ ప్రభు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే విజయ్, త్రిష కాంబోకు ఇండస్ట్రీలో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటి వరకు నాలుగు చిత్రాల్లో కలిసి నటించిన వీరిద్దరు.. ఇప్పుడు మరోసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి విజయ్ ఎంట్రీ ఇచ్చే ముందు చేయనున్న మరో సినిమాలో కూడా త్రిషనే హీరోయిన్ అని టాక్.

విజయ్ కు 24 ఏళ్ల క్రితం.. ఓ బడా పారిశ్రామిక వేత్త కుమార్తె సంగీతతో వివాహం జరిగిన విషయం తెలిసిందే. సంగీత ఓ సినిమా షూటింగ్ సమయంలో విజయ్‌ ను కలిసింది. ఆ తర్వాత పెద్దలు మాట్లాడుకుని 1999 ఆగస్టు 25న వివాహం జరిపించారు. జాసన్ సంజయ్, దివ్య సాషా అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ విజయ్, సంగీత వేర్వేరుగా ఉంటున్నట్లు, విడాకులు తీసుకోబోతున్నారంటూ ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి.

ఇప్పుడు త్రిష.. విజయ్ బర్త్ డే సందర్భంగా పోస్ట్ పెట్టిన తర్వాత కొందరు దుష్ప్రచారం చేశారు. విజయ్, త్రిష మధ్య ఏదో ఉన్నట్లు రూమర్స్ క్రియేట్ చేసి స్ప్రెడ్ చేశారు. దీంతో విజయ్ ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ అవుతున్నారు. పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి వెళ్లేముందు ఇలా చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు. అనవసరమైన గాసిప్స్ క్రియేట్ చేయొద్దని చురకలు అంటిస్తున్నారు. ఈ విషయంపై విజయ్, త్రిషలో ఎవరూ కూడా ఇంకా స్పందించలేదు.


Recent Random Post: