‘ది గర్ల్‌ఫ్రెండ్’ ఈవెంట్‌తో విజయ్–రష్మిక రిలేషన్ మిస్టరీకి కొత్త ట్విస్ట్!

Share


టాలీవుడ్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న రిలేషన్‌షిప్ గురించి ఎన్ని రూమర్స్ వచ్చినా, నిజం బయటపడలేదు. వీరిద్దరి equation ఎప్పటిలాగే మిస్టరీగానే కొనసాగుతోంది. విదేశీ వెకేషన్ల ఫొటోలు, సోషల్ మీడియాలో వైరల్ అయ్యే క్లూస్, ఫ్యాన్స్ ఊహాగానాలు — ఇవన్నీ ఉన్నా, ఇద్దరూ మాత్రం అతి తెలివిగా తమ బంధం గురించి ఎప్పుడూ స్పష్టంగా మాట్లాడలేదు. నిజమని కూడా కాదు, అబద్ధమని కూడా కాదు — అలా సమాధానం తప్పించడంలో వీరిద్దరూ ఎక్స్‌పర్ట్స్ అని చెప్పొచ్చు.

ఇటీవల అయితే ఈ మిస్టరీ మరింత గాఢంగా మారింది. విజయ్–రష్మిక జంట సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారని ఇండస్ట్రీలో గట్టిగా గాసిప్స్ వినిపించాయి. కానీ ఎటు వైపునుండీ ఎలాంటి క్లారిటీ రాలేదు. వాళ్ల సైలెన్స్ రూమర్స్‌కి మరింత బలం చేకూర్చింది. ఫ్యాన్స్ మాత్రం “ఏది నిజం? ఏది రూమర్?” అని కన్ఫ్యూజన్‌లో ఉన్నారు.

ఇప్పటివరకు పూర్తిగా పర్సనల్‌గా ఉన్న ఈ విషయం, ఇప్పుడు ప్రొఫెషనల్ లెవల్‌కి కూడా ఎంటర్ అయ్యేలా కనిపిస్తోంది. అది కూడా రష్మిక కొత్త సినిమా రూపంలో!

రష్మిక నటిస్తున్న కొత్త సినిమా టైటిల్ “ది గర్ల్‌ఫ్రెండ్.” ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్‌గా విజయ్ దేవరకొండను ఆహ్వానిస్తున్నారన్న టాక్ ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తాన్నీ షేక్ చేస్తోంది.

ఈ వార్త బయటకు రావడంతో ఫ్యాన్స్‌లో హై టెన్షన్. ఇన్నాళ్లూ ఇంటర్వ్యూలలో మాటలు తప్పించుకున్నా, లైవ్ స్టేజ్ మీద మాత్రం తప్పించుకోవడం అంత ఈజీ కాదు. విజయ్ నిజంగానే ఈవెంట్‌కు హాజరైతే, టైటిల్‌తోనైనా, సినిమాతోనైనా, రష్మిక పేరుతోనైనా — ఏదో ఒక రకంగా రూమర్స్ మళ్లీ చెలరేగడం ఖాయం.

అతను స్టేజ్ మీద “గర్ల్‌ఫ్రెండ్” సినిమా గురించి మాట్లాడతాడా, లేక తన రూమర్డ్ గర్ల్‌ఫ్రెండ్ గురించి ఏదైనా హింట్ ఇస్తాడా? అనేది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈవెంట్‌లో వాళ్ల బాడీ లాంగ్వేజ్, మాట్లాడే స్టైల్, ఎక్స్ప్రెషన్స్ — ప్రతీదీ కెమెరాల్లో క్యాప్చర్ అవుతుంది.

ఒకవేళ ఈ వివాదం దృష్ట్యా విజయ్ ఈవెంట్‌ను స్కిప్ చేసినా, అది కూడా పెద్ద న్యూస్ అవుతుంది. “విజయ్ ఎందుకు రాలేదు?” అనే చర్చ మొదలైపోతుంది. కానీ ఇండస్ట్రీ టాక్ ప్రకారం, విజయ్ ఈవెంట్‌కు వ్యక్తిగతంగా హాజరుకాకపోయినా, సినిమాలో ఏదో ఒక రకంగా తన సపోర్ట్ మాత్రం తప్పక చూపిస్తాడని అంటున్నారు.

ఏదేమైనా, “ది గర్ల్‌ఫ్రెండ్” ప్రమోషన్స్ ఇప్పుడు ఈ రూమర్డ్ కపుల్‌కు ఒక లిట్మస్ టెస్ట్‌గా మారాయి. ఇన్నాళ్లూ స్మార్ట్‌గా కవర్ డ్రైవ్స్ ఆడుతూ తప్పించుకున్న ఈ జంట, ఈసారి స్టేజ్ మీద ఎదురయ్యే బౌన్సర్‌ను ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి.


Recent Random Post: