
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది రాజా సాబ్’. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా, సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కామెడీ–హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా, సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
జనవరి 9న ‘ది రాజా సాబ్’ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుందని మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా, షూటింగ్ ఆలస్యాల కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు అన్ని పనులు పూర్తి కావడంతో సినిమా రిలీజ్‌కు పూర్తిగా సిద్ధమైంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌ను మరింత వేగవంతం చేసింది.
సినిమా ప్రారంభమైన సమయంలో ‘ది రాజా సాబ్’పై ప్రభాస్ అభిమానులతో సహా పెద్దగా అంచనాలే లేవు. డార్లింగ్ ఫ్యాన్స్ అయితే ఈ సినిమా చేయొద్దంటూ సోషల్ మీడియాలో హ్యాష్‌ట్యాగ్‌లతో ట్రెండ్ కూడా చేశారు. అయినప్పటికీ ప్రభాస్ కథను, దర్శకుడు మారుతిని నమ్మి ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేశారు. అయితే సినిమా నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుంచే అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.
ప్రభాస్‌ను వింటేజ్ లుక్‌లో చూపించడమే కాకుండా, గ్లింప్స్, టీజర్, ట్రైలర్‌తో దర్శకుడు మారుతి అభిమానులను, సాధారణ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అయితే ఈ స్థాయిలో హైప్ ఎలా క్రియేట్ చేయగలిగారనే ప్రశ్నకు మారుతి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన సమాధానం చెప్పారు.
తాను యానిమేషన్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినవాడినని, ప్రభాస్‌కు కూడా యానిమేషన్, గ్రాఫిక్స్‌పై మంచి అవగాహన ఉందని మారుతి వెల్లడించారు. “ఒక క్రియేచర్ లేదా విజువల్ ఇలా ఉండాలనుకున్నప్పుడు నేను డ్రాయింగ్ వేసి చూపించేవాడిని. ప్రభాస్ గారు కూడా ‘ఇలా ఉంటే బావుంటుంది’ అంటూ సూచనలు ఇచ్చేవారు. అలా ఇద్దరం కలిసి ఒక జర్నీలా ఈ సినిమాను డిజైన్ చేశాం” అని తెలిపారు. ఈ సినిమా క్రెడిట్‌ను తాను ఒక్కరే తీసుకోకుండా, ప్రభాస్ ఖాతాలో కూడా వేసి ఆయన స్పోర్టివ్ నేచర్‌ను ప్రత్యేకంగా ప్రశంసించారు.
మొత్తానికి, ‘ది రాజా సాబ్’ ప్రభాస్–మారుతి కలయికలో రూపుదిద్దుకున్న ఒక క్రియేటివ్ జర్నీగా నిలవబోతోందన్న నమ్మకం ఇప్పుడు అభిమానుల్లో బలంగా కనిపిస్తోంది.
Recent Random Post:















