
ఇటీవలి కాలంలో రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) వైఖరి, అభిప్రాయాలు చాలా విచిత్రంగా మారాయి. తాజాగా ఆయన తనను గట్టిగా కదిలించిన సినిమా గా ‘దురంధర్’ ను ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాం
ఇటీవలి కాలంలో రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) వైఖరి, అభిప్రాశంగా మారింది. ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు ఆదిత్య ధర్ ను ప్రశంసలతో ముంచెత్తిన ఆర్జీవీ, అతడి పనితనం, వినయవిధేయతలను కొనియాడుతూ, ఈ చిత్రాన్ని ఇంచుమించు మహాభారతంతో పోల్చడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ‘దురంధర్’ లోని పాత్రలు మహాభారతంలోని పాత్రలను గుర్తు చేస్తాయని, కథనం ఒక ఇతిహాసంలా సాగుతుందని కూడా వ్యాఖ్యానించారు.
ఇప్పటికే చాలా కాలంగా భారతీయ సినీ పరిశ్రమలో దక్షిణాది హవా కొనసాగుతోంది. హిందీ సినిమాల్లో కొన్ని మినహా మిగతావన్నీ బాక్సాఫీస్ వద్ద విఫలమవుతుండగా, అదే సమయంలో దక్షిణాది చిత్రాలు 1000 కోట్ల క్లబ్‌లతో సంచలనాలు సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ వెనుకబాటు గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అలాంటి సమయంలో, దక్షిణాదిలోనే కాకుండా జాతీయ స్థాయిలో చర్చకు దారితీసిన చిత్రం ‘దురంధర్’. ఈ సినిమా కూడా 1000 కోట్ల క్లబ్‌ను అధిగమించి కొత్త రికార్డు సృష్టించింది.
“బాలీవుడ్‌పై దక్షిణాది దండయాత్ర అనే అగ్నిగోళాన్ని ఆదిత్య ధర్ తిప్పికొట్టాడు. ‘దురంధర్’ ప్రేక్షకులను భయపెడితే, ‘దురంధర్ 2’ హడలెత్తిస్తుంది” అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. దక్షిణాది సినిమాలు అనుసరించే మసాలా టెంప్లేట్‌ను ఆదిత్య ధర్ మరింత అందంగా, గ్లామరైజ్ చేసి ప్రేక్షకులను కదిలించాడని ఆర్జీవీ అభిప్రాయపడ్డారు. ఇది దక్షిణాది సినిమాలను అణగదొక్కడానికి కాదని, రెండు పరిశ్రమల మధ్య విభేదాలు సృష్టించాలనే ఉద్దేశం కూడా లేదని స్పష్టం చేశారు.
ఆర్జీవీ మాట్లాడుతూ, దక్షిణాది సినిమాలకు ఒక నిర్దిష్ట శైలి ఉందని, కొరియన్ సినిమా తన ప్రత్యేక శైలితో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నట్లే, దక్షిణాది సినిమా కూడా తనదైన టెంప్లేట్‌తో పాపులర్ అయిందన్నారు. అయితే, అదే టెంప్లేట్‌ను ఆదిత్య ధర్ మరింత రియలిస్టిక్‌గా, ఎలివేట్ చేసి చూపించాడని, అందుకే ‘దురంధర్’ అంత ప్రభావం చూపిందని విశ్లేషించారు. ఇకపై దక్షిణాది దర్శకులు కథ చెప్పే విధానం, స్క్రిప్టింగ్‌ను తిరిగి రీఇన్వెంట్ చేయాల్సిన అవసరం ఉందని కూడా సూచించారు.
‘దురంధర్’ ఒక పరిణతి చెందిన మసాలా సినిమా అని, ప్రతి అంశాన్ని డెప్త్‌తో హ్యాండిల్ చేసిందని వర్మ ప్రశంసించారు. యాక్షన్ అతిశయోక్తులు లేకుండా నమ్మదగినదిగా అనిపిస్తుందని, సాంప్రదాయ మసాలా సినిమాల్లో ఇలాంటి పాత్ర స్పష్టత చాలా అరుదుగా కనిపిస్తుందని వ్యాఖ్యానించారు. అదే సమయంలో, హీరో ఆరాధనపై ఆధారపడి కథలు రాసే దక్షిణాది దర్శక–రచయితలను సున్నితంగా హెచ్చరిస్తూ, హీరో భక్తి భావన నుంచి బయటకు రావాలని సూచించారు.
‘దురంధర్’ లో రణ్‌వీర్ సింగ్ ఎంట్రీకి చప్పట్లు కొట్టించడం దర్శకుడి ఉద్దేశం కాదని, అతన్ని కథలో పూర్తిగా కలిసిపోయే పాత్రగా చూపించారని ఆర్జీవీ విశ్లేషించారు. “మీరు రణ్‌వీర్‌ను కాదు, కథను గుర్తుంచుకుంటారు. ప్రతి పాత్రకు సమాన ప్రాధాన్యం ఇవ్వడం చాలా అరుదైన విషయం” అని పేర్కొన్నారు. అదే సమయంలో దక్షిణాది సినిమాల్లోని అవాస్తవికత, అపరిపక్వతపై తీవ్ర విమర్శలు గుప్పించారు. హీరోయిన్ పాత్రలను అతిగా ఆకర్షణీయంగా చూపించడం, సంబంధాలను అవసరానికి మించి ఎలివేట్ చేయడం వంటి అంశాలపై కూడా ఆర్జీవీ అసంతృప్తి వ్యక్తం చేశారు.
మలయాళ సినిమా తప్ప మిగతా దక్షిణాది పరిశ్రమలు మసాలా సినిమాలు తీయడం ఆపలేదని, అందుకే ఆ పరిశ్రమల నటులు జాతీయ స్థాయిలో స్టార్‌డమ్ సంపాదించారని వర్మ చెప్పారు. అయితే, కథ చెప్పే సున్నితత్వం ఉత్తర భారత ప్రేక్షకులతో తరచూ కనెక్ట్ కాలేదని విశ్లేషించారు. ‘దురంధర్’ అదే యాక్షన్–మసాలా ఫార్ములాను ఉపయోగించినప్పటికీ, దాన్ని వాస్తవికతకు దగ్గరగా ఆదిత్య ధర్ తెరకెక్కించాడని అన్నారు. అందుకే సంగీతం, సంభాషణలు, సినిమాటోగ్రఫీ, యాక్షన్‌పై ఇప్పటికీ చర్చ జరుగుతోందని తెలిపారు. దక్షిణాది సినిమాలు థియేటర్లలో భారీ వసూళ్లు సాధిస్తాయి కానీ, బయటికి వచ్చాక చర్చించుకునే విషయాలు తక్కువగా ఉంటాయన్నది ఆయన అభిప్రాయం.
Recent Random Post:















