
యువ సామ్రాట్ నాగ చైతన్య ఇటీవల లవ్ స్టోరీస్ చేయడంపై తాను ఎందుకు కొంత భయపడ్డాడో ఓపెన్‌గా చెప్పాడు. కోవిడ్ తర్వాత ప్రేక్షకులు ఎక్కువగా యాక్షన్, యూనివర్సల్ కాన్సెప్ట్ మూవీస్ వైపే మొగ్గు చూపడంతో, ఆ సమయంలో లవ్ స్టోరీస్ పెద్దగా ఆడవని అభిప్రాయాలు రావడంతో తాను కూడా అలాంటి కథలు చేయడానికి కొంత వెనకడుగు వేసినట్టుగా పేర్కొన్నాడు.
ప్రేమంటే చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు నాగ చైతన్య గెస్ట్‌గా హాజరయ్యాడు. అక్కడే మాట్లాడుతూ—
“నాకు లవ్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం. యాక్టర్‌గానే కాదు, ఆడియన్స్‌గా కూడా ప్రేమకథలు నాకిష్టమే. కానీ కోవిడ్ టైంలో లవ్ స్టోరీస్ ఆడవని భయపెట్టారు. కానీ ఇప్పుడు మంచి లవ్ స్టోరీస్ వస్తే ఫలితం కూడా బాగుంటుందని రీసెంట్ టైమ్ ప్రూవ్ చేసింది” అని చెప్పాడు.
ఈ సందర్భంగా చిత్రయూనిట్‌ను ప్రశంసించిన చైతన్య,
ప్రియదర్శి గురించి మాట్లాడుతూ— అతను “మోస్ట్ వర్సటైల్ యాక్టర్. చిన్న, పెద్ద సినిమాల్లో సపోర్టింగ్ నుంచి లీడ్ రోల్స్ వరకూ తన కెరీర్‌ను అద్భుతంగా నిర్మించుకుంటున్నాడు” అని కితాబిచ్చాడు.
ఆనందితో కస్టడీ షూట్ సమయంలో చిన్న పాత్ర కోసం కలిసి పని చేసిన విషయాన్ని గుర్తుచేసుకున్నాడు.
ఈవెంట్లో సుమ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని, ఆమె పోషించిన పోలీస్ ఇంటరాగేషన్ సీన్ ఆడియన్స్‌ను అలరిస్తుందన్నాడు.
సినిమాకు లియోన్ జేమ్స్ ఇచ్చిన సంగీతం చాలా బాగుందని చెప్పి టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు.
అయితే ఈవెంట్ తర్వాత అక్కినేని ఫ్యాన్స్ మాత్రం—
“చైతన్య లవ్ స్టోరీస్ చేయడానికి భయపడటం ఎందుకు?”
అని ప్రశ్నిస్తున్నారు. అక్కినేని హీరోలకు సంప్రదాయంగా లవ్ స్టోరీస్ బెస్ట్ సూట్ అవుతాయని, చైతన్య కూడా ప్రేమకథల ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యాడని గుర్తుచేస్తున్నారు.
ఇటీవలి కాలంలో నాగ చైతన్య తండేల్తో విజయం సాధించడం కూడా ఒక లవ్ స్టోరీ కారణంగానే కావడంతో, అతను ఎలాంటి సందేహాలు లేకుండానే లవ్ స్టోరీస్ చేయవచ్చని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
Recent Random Post:















