నటుడికంటే మేధావి వ్యాపారవేత్త: వివేక్ ఒబెరాయ్

Share


“హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ చేయాలి” అనే మాటని నిజంగా అమలు చేసింది ఒకరు ఉంటే, అది నటుడు వివేక్ ఒబెరాయ్. ‘రక్తచరిత్ర’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన వివేక్, బాలీవుడ్‌లో అతి కఠినమైన దశను ఎదుర్కొన్నప్పటికీ ఇప్పుడు పారిశ్రామిక రంగంలో దూసుకెళ్తున్నాడు.

ఐశ్వర్యరాయ్‌తో రిలేషన్ సమయంలో ఇండస్ట్రీలో ఎదురైన కుట్రల కారణంగా ఆఫర్లు కోల్పోయిన వివేక్, డిప్రెషన్‌లోకి వెళ్లిన విషయం తెలిసిందే. అయినా నటుడిగా గుండెతొ ఎదిరించి మళ్లీ నిలబడగలిగాడు. అయితే ఆయన జీవితం నిజంగా ఆసక్తికరంగా మారింది నటనతో కాదు, వ్యాపార ధోరణితో!

తాజాగా ఓ ఇంటర్వ్యూలో వివేక్ ఒబెరాయ్ చేసిన వెల్లడనలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఒక సంవత్సరం వ్యవధిలో తన వ్యాపార కంపెనీల కోసం రూ.8,500 కోట్ల పెట్టుబడులను సేకరించానని చెప్పాడు. సినిమాలు అతడి అభిరుచికి చెందేవి, కానీ సంపాదన మాత్రం రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్, విద్యా రంగంలో పెట్టుబడులు, స్టార్టప్స్ వంటి విభిన్న వ్యాపారాల ద్వారానే వస్తోందని వివరించాడు.

తన వ్యాపార మేధస్సు తండ్రి సురేష్ ఒబెరాయ్ ద్వారా వచ్చిందంటాడు. చిన్న వయసులోనే బిజినెస్ సూత్రాలు నేర్చుకున్న వివేక్, పదేళ్ల వయసులోనే స్మాల్ వ్యాపారాలు చేసి లాభాలు సంపాదించడం మొదలుపెట్టాడట. ఇప్పుడు అయితే తన నికర ఆస్తి విలువ సుమారుగా రూ.1,200 కోట్లు. ఇది టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ ఆస్తుల స్థాయిలోనే ఉందని చెబుతున్నారు.

ప్రస్తుతం వివేక్ ఒబెరాయ్ విద్యాసంస్థలకు రుణాలిచ్చే వ్యాపారంలోనూ ఉన్నాడు. దాదాపు రూ.3,400 కోట్ల వ్యాపారం ఆయన పర్యవేక్షణలో సాగుతుంది. “సినిమాల్లో ఎంత తిప్పిన తనకు తానె గుర్తొచ్చిన మార్గం వ్యాపారమే” అని చెబుతూ, “మార్వాడీ మనస్తత్వం ఉండి, సిలికాన్ వ్యాలీని కలలుగా ఎంచుకుంటే విజయం దాదాపుగా ఖాయం” అని తన సిద్ధాంతాన్ని వెల్లడించాడు.

అలాగే సినిమా ఇండస్ట్రీలో కొందరు ‘అన్‌ఆఫీషియల్ కంట్రోల్’ వహిస్తున్నారని, అవకాశాలను నియంత్రిస్తున్నారని వివేక్ బహిరంగంగానే సంచలన వ్యాఖ్యలు చేశాడు.


Recent Random Post: