నా గురించి నెగెటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు!-ఉపాసన

నా గురించి మాట్లాడుతూ కొందరు నెగెటివిటీని ప్రచారం చేస్తున్నారని ఉపాసన రామ్ చరణ్ వాపోయారు. తాను గోల్డెన్ స్పూన్ తో పుట్టానని అంటున్నారని.. అయితే తన తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారని ఉపాసన కొణిదెల ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. విశ్రాంతి అనేది లేకుండా తాను నిరంతర వృత్తిపరమైన బాధ్యతలతో చాలా బిజీగా ఉన్నానని చరణ్ తాను తమ పిల్లలను అలాగే పెంచుతామని కూడా అన్నారు. నా గురించి నెగెటివ్ గా రాసి నెగెటివిటీని స్ప్రెడ్ చేయొద్దని ఉపాసన రామ్ చరణ్ ఈ సందర్భంగా కోరారు.

నిజానికి ఉపాసన అపోలో సంస్థానంలో ఒక ఉద్యోగిగా వృత్తి పరంగా ఎంతో బిజీగా ఉన్నారని చెబుతారు. అపోలో లైఫ్ చైర్ పర్సన్ గా- బి పాజిటివ్ మ్యాగజైన్ ఎడిటర్ గా ఆమె ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఉపాసన ప్రస్తుతం తన లైఫ్ యాంబిషన్స్ పైనే ఎక్కువ ఫోకస్ చేసారు.

అపోలో హెల్త్ మ్యాగజైన్ నిర్వాహకురాలిగా హెల్త్ కౌన్సిలర్ గా తనని నిరంతరం క్షణం తీరిక లేని షెడ్యూళ్లతో అభిమానులు చూస్తున్నారు. ఉపాసన బిజీ ఎంటర్ ప్రెన్యూర్. అపోలో సంస్థానానికి ఆస్తులు అంతస్తులు ఉన్నాయని వేల కోట్ల సామ్రాజ్యం ఉందని ఉపాసన ఏనాడూ ధీమాగా కూచున్నది లేదు. తమ సంస్థాన బాధ్యతలను మోయడం అనేది చాలా సంక్లిష్టమైన ప్రక్రియ.

ఏపీలో 90 వేల మొక్కలు నాటే ప్రక్రియ

ఇక తన లైఫ్ కి సంబంధించిన ఏ విషయాన్ని అయినా ఉపాసన నేరుగా సోషల్ మీడియా వేదికగా అభిమానులకు చేరవేస్తుంటారు. తన తాతగారైన ప్రతాప్ రెడ్డి బర్త్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో పచ్చదనం పెంపుదల గురించి ఒక అద్భుతమైన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

ఫౌండర్ చైర్మన్ అపోలో హాస్పిటల్స్ గ్రూప్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి 90వ జన్మదిన వేడుకల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 90000 చెట్లను నాటేందుకు అపోలో హాస్పిటల్స్ ఫౌండేషన్ – ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ భాగస్వామ్యం కలిగి ఉన్నాయని తెలిపారు.

దీనివల్ల నిరంతర వాహనాల నుంచి కర్బన ఉద్గారాలను తగ్గించడం.. వన్యప్రాణుల ఆవాసాలను సంరక్షించడం.. స్థానిక కమ్యూనిటీలకు గాలి నాణ్యతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నామని ఈ సందర్భంగా వెల్లడించారు.


Recent Random Post: