అక్కినేని కుటుబంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో ఎంత సంచలనమయ్యాయో తెలిసిందే. దీంతో నాగార్జున ఆమెపై పరువు నష్టం దావా కేసు కూడా వేసారు. ప్రతిగా సురేఖ దిగొచ్చి సమంతకు క్షమాపణలు తెలియజేసారు. ఈ పిటీషన్ పై విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు సురేఖకు నోటీసులు కూడా జారీ చేసింది. ఈనెల 12న సురేఖ వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. అయితే నిన్న జరిగిన విచారణకు మాత్రం సురేఖ హాజరవ్వలేదు.
పలు కార్యక్రమాల కారణంగా వ్యక్తిగత విచారణకు హాజరు కాలేనని ఆమె తరుపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. ఈనేపథ్యంలో మరింత గడువు కావాలని కోర్టును కోరారు. దీంతో న్యాయస్థానం ఈనెల 19కి విచారణ వాయిదా వేసింది. సురేఖ విచారణకు హాజరు కాకపోవడంపై అక్కినేని అభిమానులు పోస్టులు పెడుతున్నారు.
సురేఖ మాట్లాడిన ప్రతీ మాటకు కోర్టులో సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఎలాంటి ఆధారాలతో ఆమె అలా మాట్లాడిందని మండిపడుతున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ ను విమర్శించే క్రమంలో సురేఖ అక్కినేని ఫ్యామిలీ-సమంతను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసారు. దీంతో అక్కినేని ఫ్యామిలీ ఆగ్రహం వ్యక్తం చేసింది. నాగార్జున వెంటనే పరువు నష్టం దావా వేసారు. అలాగే ఇండస్ట్రీ నుంచి కూడా పెద్ద ఎత్తున అక్కినేని ఫ్యామిలీకి మద్దతు లభించింది.
సురేఖ వ్యాఖ్యల్ని తీవ్రంగా పరిగణించి ఆమపై ఆగ్రహం వ్యక్తం చేసారు. తక్షణమే అక్కినేని ఫ్యామిలీకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసారు. ప్రతిగా ఆమె సమంత కు క్షమాపణలు తెలియజేసారు. సురేఖ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చకు దారి తీసాయి. సినిమా-రాజకీయం రెండు వేర్వేరు రంగాలైనా రెండింటిని ముడిపెట్టి ఆమె మాట్లాడిన తీరుపై అభ్యతరం వ్యక్తమైంది.
Recent Random Post: