
నేచురల్ స్టార్ నాని టాలీవుడ్‌లో ఓ ప్రత్యేకమైన నటి. సినీ పరిశ్రమలో పెద్ద వారసత్వం లేకుండానే, తన కేవలం ప్రతిభతోనే ఎదిగిన స్టార్. అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించి, స్టార్ హీరో స్థాయికి చేరుకున్న నాని, ప్రేక్షకుల్లో ప్రత్యేక గౌరవాన్ని సంపాదించుకున్నాడు. చిరంజీవి, రవితేజ తర్వాత మాస్ ప్రేక్షకులకు మరింత చేరువైన హీరోగా నిలిచాడు.
తాజాగా, ఈ టాలెంటెడ్ నటుడు టాలీవుడ్‌లో మరో స్ట్రాటజిక్ మూవ్ ప్లాన్ చేశాడు. నాని నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై వచ్చిన హిట్ ప్రాంచైజీ ఇప్పటికే బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు హిట్ 3లో తానే హీరోగా నటిస్తూ, ఈ క్రైమ్ థ్రిల్లర్ యూనివర్స్‌ను మరింత విస్తరించే పనిలో ఉన్నాడు. భవిష్యత్‌లో ఈ ప్రాంచైజీని మరికొందరు స్టార్ హీరోలతో కొనసాగించేందుకు స్ర్కిప్ట్ వర్క్ జరుగుతుందని సమాచారం. ఇప్పటికే హిట్ 4లో కార్తీ హీరోగా నటిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
దర్శకుడు శైలేష్ కొలనూ ఈ ప్రాంచైజీ నుంచి ఐదారు సినిమాలైనా వస్తాయని హామీ ఇచ్చినప్పటికీ, నాని మాత్రం హిట్ యూనివర్స్‌ను అన్‌స్టాపబుల్‌గా విస్తరించేలా క్రైమ్ థ్రిల్లర్ చిత్రాల్ని నిర్మించాలనుకుంటున్నాడట. దేశంలో జరిగిన పలు హత్యలు, క్రైమ్ కేసుల ఆధారంగా సినిమాలు తెరకెక్కించి, కొత్త టాలెంట్‌కు అవకాశం ఇచ్చేందుకు భారీ స్కెచ్ వేస్తున్నాడని టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
అంతేకాదు, “ది ప్యారడైజ్” అనే మరో క్రైమ్ థ్రిల్లర్ ప్రాజెక్టును కూడా నాని స్ట్రాంగ్‌గా బ్యాకప్ చేస్తున్నాడట. ఇది రెండు భాగాలుగా తెరకెక్కనుండగా, మొదటి పార్ట్‌లో నాని హీరోగా కనిపించనుండగా, సీక్వెల్‌లో కొత్త స్టార్‌ను పరిచయం చేసే ఆలోచనలో ఉన్నారట. అధికారికంగా ఈ సినిమాకు నాని నిర్మాత కాకపోయినా, ప్రాజెక్ట్‌లో కీలక పాత్ర పోషిస్తున్నట్లు టాలీవుడ్ టాక్.
ఈ విధంగా, నాని తన మార్క్‌ని టాలీవుడ్‌లో సెట్ చేస్తూ, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను కొత్త స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడు. చూస్తుంటే, భవిష్యత్తులో ఇది ఒక భారీ సినిమా యూనివర్స్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి!
Recent Random Post:















