నారాయణమూర్తిని నిలదీసిన నట్టికుమార్

Share


ఆర్. నారాయణమూర్తిపై నిర్మాత నట్టికుమార్ ప్రశ్నల వర్షం
నిజాయితీ, నిక్కచ్చితనానికి పర్యాయంగా భావించబడే సీనియర్ నటుడు, దర్శకుడు ఆర్. నారాయణమూర్తి ఇటీవల రాజకీయపరంగా తీసుకుంటున్న వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో పక్షపాతం లేకుండా మాట్లాడే నేతగా పేరు తెచ్చుకున్న నారాయణమూర్తి, ఇటీవల వైఎస్ జగన్‌ను బహిరంగంగా సమర్థిస్తూ, ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ప్రశంసించడం ప్రారంభించారు. ఇది ఇంతటితో ఆగకుండా, జగన్‌కు రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేయడం వరకు వెళ్లింది.

ఇటీవలే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై నారాయణమూర్తి స్పందిస్తూ, ఆయన థియేటర్ల వ్యవస్థపై దాడికి తెగబడుతున్నట్లు అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. దీనిపై నిర్మాత నట్టికుమార్ తీవ్రంగా స్పందించారు. నారాయణమూర్తిని ఉద్దేశించి ఆయన కొన్ని కఠినమైన ప్రశ్నలు సంధించారు.

“భీమ్లా నాయక్” విడుదల సమయంలో ఏపీ ప్రభుత్వం కుట్రపూరితంగా థియేటర్లు మూయించిందని, టికెట్ల ధరలు తప్పుదోవ పట్టించి 5-10 రూపాయలకు అమ్మించారని నట్టికుమార్ ఆరోపించారు. ఆ సమయంలో నారాయణమూర్తి ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారు? అని ప్రశ్నించారు.

అంతేకాకుండా, పవన్ కళ్యాణ్ సినిమాలపై నిర్బంధాలు, బెదిరింపులు ఉన్నాయని, అఫిడవిట్లు ఇచ్చినా థియేటర్లు బంద్ చేయించారని, తాను అవసరమైతే ఆ థియేటర్ల పూర్తి జాబితా ఇవ్వగలనన్నారు.

ఇప్పుడు టికెట్ల ధరల పెంపుపై నారాయణమూర్తి ఎందుకు స్పందించట్లేదని, ఒక్కో పాప్ కార్న్‌కు రూ.300 వసూలు చేస్తున్న సినిమా హాళ్లను చూసి కూడా మౌనం వహించడం ఆశ్చర్యకరమని అన్నారు.

“సినిమా పరిశ్రమకు సంబంధించిన అన్ని సమస్యలపై సమంగా స్పందించాలి. ఒకరికి అన్యాయం జరిగితే మౌనం, మరొకరికి జరిగినప్పుడు ముక్తకంఠంతో మాట్లాడడం తగదు” అని నట్టికుమార్ అభిప్రాయపడ్డారు.


Recent Random Post: