కామెడీ హీరో నుంచి తనను తాను సీరియస్ హీరోగా మార్చుకునే క్రమంలో వరుసగా అలాంటి సినిమాలే చేస్తున్నాడు అల్లరి నరేష్. తన పేరులోని అల్లరి కనిపించేలా ఇన్నాళ్లు సరదా సినిమాలు చేస్తూ వచ్చిన అల్లరి నరేష్ నాంది నుంచి పూర్తిగా పంథా మార్చాడు.
నాంది సినిమా హిట్ నరేష్ కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. అందుకే ఇక మీదట సీరియస్ కథలే చెప్పాలని ఫిక్స్ అయ్యాడు. నాంది తర్వాత వచ్చిన మారేడుమిల్లి ప్రజానీకం సినిమా ఫ్లాప్ అయ్యింది. అయినా సరే నరేష్ అదే పంథా కొనసాగిస్తున్నాడు.
ప్రస్తుతం నాంది డైరెక్టర్ విజయ్ తోనే ఉగ్రం సినిమా చేసిన నరేష్ ఆ సినిమాతో నెక్స్ట్ వీక్ బరిలో దిగుతున్నాడు. ఈ సినిమా కోసం అల్లరి నరేష్ ఏకంగా 500 సిగరెట్లు అదికూడా నాలుగు రోజుల్లో తాగేశాడట. సినిమా కోసం హీరోలు సిగరెట్లు తాగడం కామనే.
అయితే అసలు అంతకుముందు అలవాటు లేని వారు కూడా సినిమాలో సీన్స్ కోసం తాగుతుంటారు. ఇదిలాఉంటే నరేష్ కూడా ఉగ్రం లో ఒక ఫైట్ సీన్ కోసం సిగరెట్లు తాగాడట. నాలుగు రోజులు షూటింగ్ జరగ్గా ఆ నాలుగు రోజుల్లో 500 సిగరెట్లు పూర్తి చేశాడట.
అలా మోతాదుకి మించి సిగరెట్లు తాగడం వల్ల తన ఆరోగ్యం పాడైందని.. మరుసటి రోజు నుంచి దగ్గు రావడంతో షూటింగ్ కు బ్రేక్ ఇచ్చామని అన్నారు. సినిమా కోసం హీరోలు ఎంతో కమిటెడ్ గా ఉంటారు. సీన్ బాగా రావడం కోసం నరేష్ కూడా నాలుగు 500 సిగరెట్లు అంటే రోజుకి 100 సిగరెట్లు అన్నమాట. అంటే గంటకు 10 చొప్పున లాగిచ్చేశాడని చెప్పొచ్చు.
నరేష్ సరసన మిర్నా హీరోయిన్ గా నటించిన ఉగ్రం సినిమా వరుస కిడ్నాప్ లు చేసే ముఠాని ఒక పోలీస్ ఆఫీసర్ ఎలా కనిపెట్టి వారి పని పెట్టాడన్న కథతో వస్తుంది. ఈ సినిమాతో నరేష్ మాస్ అటెంప్ట్ చేశారు. మరి సినిమా అనుకున్న రేంజ్ లో ఉంటుందా లేదా అన్నది చూడాలి.
Recent Random Post: