
ఒక సక్సెస్ మనకు ఎంత సంతోషాన్ని ఇస్తుందో, ఒక ఫెయిల్యూర్ అంతకంటే ఎక్కువ పాఠాన్ని నేర్పుతుంది. యంగ్ హీరో నితిన్ ఇప్పుడు అదే పరిస్థితి ఎదుర్కొంటున్నాడు. రాబిన్‌హుడ్, తమ్ముడు చిత్రాలపై పెద్ద ఆశలు పెట్టినా, బాక్సాఫీస్ వద్ద ఆ రెండు సినిమాలు నిరాశపరిచాయి. ఈ బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ల తర్వాత, నితిన్ తన కెరీర్‌ను పునరాలోచనలోకి తీసుకెళ్ళాడు. ప్రతీ అడుగును చాలా ఆచితూచి, తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై పూర్తిగా ఫోకస్ అవుతున్నాడు.
ఈ పునరాలోచనలో భాగంగా, నితిన్ కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాడు. ఎక్కువ క్రేజ్ ఉన్న ‘బలగం’ ఫేమ్ వేణు యెల్దండి దర్శకత్వంలో చేయాల్సిన ఎల్లమ్మ ప్రాజెక్ట్ మరియు విక్రమ్ కె కుమార్ స్పోర్ట్స్ డ్రామా వంటి కొన్ని చిత్రాల నుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నిర్ణయాలు కేవలం సినిమాలను వదులుకోవడం మాత్రమే కాదు, తన ప్రస్తుత ఇమేజ్, మార్కెట్‌కు ఏ కథ సరిపోతుందో లోతుగా విశ్లేషిస్తున్న సూచనగా చూడవచ్చు.
ప్రస్తుతం నితిన్ కొత్త దర్శకులు, కొత్త కథల వైపు ఎక్కువగా చూస్తున్నాడు. లిటిల్ హార్ట్స్తో సెన్సేషన్ క్రియేట్ చేసిన సాయి మార్తాండ్‌తో ఒక ఫ్రెష్ లవ్ స్టోరీ కోసం చర్చలు జరుగుతున్నాయి. ఇది నితిన్‌కు సరిగ్గా సరిపోయే జానర్. ప్రేమ కథలే తన కెరీర్‌ను మళ్ళీ ట్రాక్‌లోకి తీసుకొచ్చాయి. అందుకే, ఈ సేఫ్ గేమ్ ద్వారా తిరిగి కెరీర్‌ను స్థిరం చేసుకోవాలనిపిస్తోంది.
అయితే, మరో హాట్ టాపిక్ కూడా వినిపిస్తోంది. ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం వంటి థ్రిల్లర్లతో తనకు ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేసిన దర్శకుడు VI ఆనంద్‌తో నితిన్ కథా చర్చల్లో ఉన్నాడని టాక్. దీని ద్వారా నితిన్ కేవలం సేఫ్ గేమ్ ఆడకపోగా, ఆడియన్స్‌ను థ్రిల్ చేసే కొత్త కాన్సెప్ట్‌తో రావడానికి సిద్ధమని తెలుస్తోంది. శ్రీను వైట్లతో కూడా కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి, కానీ అవి అధికారికంగా రాయాల్సినవి కావు.
ఇది చూసుకుంటే, పదేళ్ల క్రితం ఇష్క్ చిత్ర సమయంలోని పరిస్థితి గుర్తుకు వస్తోంది. వరుస ఫ్లాపుల తర్వాత, ఫ్రెష్, అర్బన్ లవ్ స్టోరీతో నితిన్ కెరీర్‌ను తిరిగి ట్రాక్‌లోకి తీసుకెచ్చాడు. ఇప్పుడు కూడా అదే ఫార్ములాతో రాబోతోన్నాడు. మాస్ మసాలా కథలను పక్కన పెట్టి, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ లేదా యువత ప్రేక్షకులకు నచ్చే లవ్ స్టోరీలతో తనను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.
ప్రస్తుతం ఏ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించబడలేదు. కానీ నితిన్ ఎంచుకునే తదుపరి చిత్రం అతని కెరీర్‌కు కీలకం అవుతుంది. లిటిల్ హార్ట్స్ వంటి సేఫ్ లవ్ స్టోరీతో వస్తాడా, లేక VI ఆనంద్ వంటి దర్శకుడితో రిస్క్ తీసుకుని కొత్తగా మెప్పిస్తాడా అనేది తెలియాలంటే కొంత సమయం చూడాల్సిందే.
Recent Random Post:















