నిర్మాతగా కొత్త ఆరంభానికి సిద్ధమైన కృతి సనన్

Share


ఒకేసారి రెండు పడవల ప్రయాణం అంత సులభం కాదు. ముఖ్యంగా నటి జీవితంలో అయితే అది మరింత కష్టసాధ్యం. కానీ, ఫ్యాషన్‌తో పాటు ఫోకస్‌ కూడా ఉంటే అసాధ్యమేమీ కాదు అని నిరూపిస్తోంది కృతి సనన్. బాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆమె, ఇప్పుడు నిర్మాతగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.

గత ఏడాది ‘బటర్‌ఫ్లై ఫిల్మ్స్’ పేరుతో స్వంత నిర్మాణ సంస్థను స్థాపించి, తొలి చిత్రంగా **‘దో పత్తీ’**ను నిర్మించింది. ఈ సినిమాకు మిశ్రమ స్పందన (డివైడ్ టాక్) వచ్చినప్పటికీ, కృతి ప్రొడక్షన్‌లో చూపిన ఆసక్తి అందరినీ ఆకట్టుకుంది.

అయితే, ఆ సినిమా విడుదలై ఏడాది పూర్తయినప్పటికీ, ఇప్పటి వరకు కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించలేదు. దీంతో, “కృతి నిర్మాతగా ఆగిపోయిందా?” అనే ప్రశ్నలు బాలీవుడ్‌లో వినిపించాయి. కానీ, తాజా సమాచారం ప్రకారం, ఆమె రెండవ చిత్రానికి సంబంధించి దర్శకులు, రచయితలతో సీరియస్ చర్చలు జరుపుతోందట. వచ్చే ఏడాది కొత్త ప్రాజెక్ట్‌పై అప్‌డేట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

తొలి సినిమాకు మిశ్రమ స్పందన రావడంతో, తదుపరి ప్రాజెక్ట్ విషయంలో కృతి చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోందని సమాచారం. సరైన కథ, బలమైన స్క్రిప్ట్‌ దొరకకపోవడంతోనే ఆమె లాంగ్ గ్యాప్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇక నటిగా కృతి సనన్ ప్రస్తుతం పుల్ బిజీగా ఉంది. ధనుష్ హీరోగా, ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘తేరే ఇష్క్ మే’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. హిందీ, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయి, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. అదనంగా, ఆమె **‘కాక్‌టెయిల్ 2’**లోనూ నటిస్తోంది.


Recent Random Post: