
బాలీవుడ్‌కు ప్రత్యేకమైన హాస్య శైలిని అందించిన ప్రముఖ నటుడు పరేష్ రావల్, ప్రస్తుతం వరుసగా క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవల అనారోగ్య కారణంగా వైద్యుల సూచన మేరకు తాను తన మూత్రాన్ని తానే తాగినట్టు వెల్లడించి, ఆరోగ్యంగా తిరిగి కోలుకున్నానని చెప్పడం ఆయనపై దృష్టి మళ్లించింది. ఈ వ్యాఖ్యలతో అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారిన పరేష్ రావల్, తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు.
2024లో కేవలం రెండు సినిమాల్లో నటించిన పరేష్ రావల్, 2025-26కు గాను భారీ లైన్ప్ సిద్ధం చేసుకున్నారు. ఈ కాలానికి ఆయన చేతిలో ఎనిమిది సినిమాలు ఉన్నాయి. ఇందులో మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కిస్తున్న రెండు పెద్ద సినిమాలు హేరా ఫేరీ 3 మరియు భూత్ బంగ్లా ఉన్నాయి. ఈ రెండు చిత్రాల్లోనూ అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నారు.
ఇదే సందర్భంలో బాలీవుడ్ మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన పరేష్ రావల్, అక్షయ్ కుమార్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో 21 సినిమాల్లో కలసి నటించినప్పటికీ, “అతను నా కో-స్టార్ మాత్రమే” అని చెప్పడం అక్షయ్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది.
అలాగే, భూత్ బంగ్లా సినిమాపై మాట్లాడుతూ, “ఇది ఒక అద్భుతమైన చెత్త హారర్ కామెడీ” అని తనదైన స్టైల్లో వ్యాఖ్యానించారు. ఈ మాటలతో సినిమాపై అందరిలో ఆసక్తి మరింత పెరిగింది. బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రం 2026లో విడుదలై భయాన్ని పుట్టిస్తూనే కామెడీతో పండగ చేస్తుందని తెలుస్తోంది.
ప్రియదర్శన్ డైరెక్షన్, అక్షయ్ కుమార్ – పరేష్ రావల్ కాంబినేషన్ ఉన్న ఈ సినిమా హారర్ కామెడీ జానర్లో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వనుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
Recent Random Post:















