పాడుతా తీయగా వివాదం: ప్రవస్తిపై సునీత కఠిన స్పందన

Share


గత రెండు రోజులుగా గాయనీ ప్రవస్తి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. ప్రముఖ సంగీత రియాలిటీ షో “పాడుతా తీయగా” పై ఆమె చేసిన ఆరోపణలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ప్రవస్తి ఈ షో నుంచి అన్యాయంగా ఎలిమినేట్ చేయడమే కాకుండా, బాడీ షేమింగ్‌కు కూడా గురైంది అని ఆరోపించింది. ఈ ఆరోపణలపై జడ్జ్‌గా ఉన్న సింగర్ సునీత స్పందిస్తూ ఒక వీడియోను విడుదల చేసింది.

సునీత మాట్లాడుతూ – “ఒక మంచి పాట వింటే ఎమోషనల్ అయ్యేంతలా ఫీలైన సందర్భాలూ ఉన్నాయి. ప్రవస్తి ఆ వీడియోలు చూడకపోయే ఉండొచ్చు. అప్పట్లో చిన్నపిల్లలా ఉన్న ఆమె, ఇప్పుడు రోడ్డుమీదకి వచ్చి ఈ విషయాలపై మాట్లాడే స్థాయికి వచ్చిందంటే నన్ను బాధిస్తోంది,” అని తెలిపారు.

ప్రవస్తి ఎన్నో షోలలో పాల్గొన్నప్పటికీ, షో యొక్క ప్రాసెస్ ఆమెకు తెలియదా అనే ప్రశ్నను సునీత సంధించింది. “సాంగ్ రైట్స్ కారణంగా మళ్లీ పాటలు మార్చాల్సి వచ్చేది, ఈ విషయాలు నీకు తెలుసు కదా. అయితే ఈ విషయాలన్నీ బయటపెట్టాలి. నిజాలు చెప్పితేనే నిజమైన ప్రయోజనం ఉంటుంది,” అని ఆమె చెప్పింది.

“నువ్వు తప్ప ఇంకెవరూ నాతో ఆల్బమ్‌లో పాడలేదు. నిన్ను ఇష్టపడకపోతే నీతో పని చేస్తానా? మర్చిపోయి నిన్ను తప్పుబట్టడమే అనుచితమని గుర్తించు,” అని అన్నారు.

అలాగే, ఎలిమినేషన్ సమయంలో ప్రవస్తి తల్లి చేసిన వ్యాఖ్యలపై కూడా స్పందించారు. “మీ అమ్మగారు నన్ను చూశాక చెయ్యి చూపిస్తూ ‘ఇదిగో దీన్ని కారణం’ అని అన్నా. అది నీకు సరైనట్టే అనిపించిందా?” అంటూ ప్రశ్నించారు.

“ఒటమి, గెలుపు సహజం. ఓటమిని అంగీకరించి జీవితంలో ముందుకెళ్లాలి. సీనియర్లను గౌరవించాలి. నేర్చుకోవాలి. మేమూ ఎన్నో పాటలు పాడాం, కట్ చేశారు, అయినా ఎప్పుడూ బయట వచ్చి విమర్శించలేదు. ఇప్పటికైనా నువ్వు ఓటమిని అంగీకరించి, మంచి గురువుల వద్ద మ్యూజిక్ నేర్చుకుని జీవితంలో పైకి రావాలని కోరుకుంటున్నాను,” అని సునీత తన సందేశాన్ని ముగించారు.


Recent Random Post: