పాపరాజీలపై కాజోల్ ఆగ్రహం!

Share


సెలబ్రిటీలు బయటకు వస్తే ఫోటోగ్రాఫర్లు రెడీగా ఉంటారు. కెమెరా క్లిక్స్ ఆగకుండా చర్రూ మంటూ సాగిపోతుంటాయి. అది సినిమా ఈవెంట్ అయినా, ప్రైవేట్ ఈవెంట్ అయినా ఫోటోగ్రాఫర్లకు గ్యాప్ ఉండదు. వృత్తిపరంగా తమ పని చేస్తున్నారు కానీ కొన్నిసార్లు ఈ పాపరాజీలు హద్దులు దాటి ప్రైవేట్ స్పేస్‌ను భంగం చేస్తూ విమర్శలకు గురవుతుంటారు.

బాలయ్య, చిరంజీవి లాంటి స్టార్ హీరోలు కూడా కొన్ని సందర్భాల్లో ఇలా ప్రైవేట్ స్పేస్‌ను ఉల్లంఘించినప్పుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా బాలీవుడ్ నటి కాజోల్ ఈ వ్యవహారంపై తన అసహనం వ్యక్తం చేసింది.

పాపరాజీ సంస్కృతిపై స్పందించిన కాజోల్ మాట్లాడుతూ — “ఈ ఫోటోగ్రాఫర్లను చూసి నాకు కొంత అవగాహన ఏర్పడింది. వారికీ కొన్ని హద్దులు ఉండాలని అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో వారు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. ఒక సెలబ్రిటీ అంత్యక్రియలకు వెళ్లినప్పుడు కూడా ఫోటోలు తీసేందుకు పరిగెత్తుతారు. అప్పుడు నిజంగా కోపం వస్తుంది. విలువలు లేకుండా చేసే ఈ పనులు బాధ కలిగిస్తాయి. నేను ఒక సాధారణ మహిళ అయితే పోలీసులు ఫిర్యాదు చేసేవారిని. నేను అంత చేయలేకపోవడం బాధగా ఉంది. అంత్యక్రియల్లో రెండు మూడు ఫోటోలు తీసుకోవడంలో తప్పులేదు. కానీ పరిస్థితిని అర్థం చేసుకోకుండా మితిమీరిన ప్రవర్తన ఇబ్బందిగా అనిపిస్తుంది” అని పేర్కొంది.

ప్రస్తుతం సెలబ్రిటీలకు ఇది ఒక పెద్ద సమస్యగా మారిందని ఆమె చెప్పిన మాటలు పాపరాజీ వ్యవహారంపై మరోసారి చర్చ మొదలయ్యేలా చేశాయి.


Recent Random Post: