పృథ్వీరాజ్‌పై కుట్ర? మల్లికా సుకుమారన్ సంచలన వ్యాఖ్యలు

Share


ఇండస్ట్రీ ఏదైనా—సినీ రంగం, వ్యాపారం, రాజకీయాలు—ఎదగాలంటే పోటీ అన్నది సహజం. అయితే ఆ పోటీ ఎప్పుడూ హెల్తీగా ఉండదు. సినీ ఇండస్ట్రీలో అయితే ప్రత్యేకంగా… ఎవరో ఒక్కరు ఎదగడం మొదలెడితే, వారిని కిందకి లాగడానికి ప్రయత్నించే వారు కూడా కనిపిస్తూనే ఉంటారు.

ఇలాంటి ‘పుల్లలు వేసిన’ కథలు, స్టార్‌లు ఎదుర్కొన్న ఒత్తిళ్లు తరచూ వినిపిస్తూనే ఉంటాయి. కొందరు తెరిగా మాట్లాడుతుంటే, మరికొందరు మాత్రం మౌనం వహిస్తారు. ఇప్పుడు అలాంటి సంఘటనల్ని బయటపెట్టిన వ్యక్తి మలయాళ నటుడు సుకుమారన్ గారి భార్య, పృథ్వీరాజ్ సుకుమారన్ తల్లి — మల్లికా సుకుమారన్.

తన కొడుకు కెరీర్‌ను కావాలనే దెబ్బతీయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.

పృథ్వీరాజ్ కెరీర్‌లో ఎదుగుదల – వెనుకున్న ఇబ్బందులు

2002లో నందనం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పృథ్వీరాజ్, తొలి దశలో పెద్దగా విజయం చూడలేక కష్టాలుపడ్డారు. విమర్శలు, అవహేళనలు, ఒత్తిడులు అన్నీ ఎదుర్కొంటూ నేటి స్టార్‌ స్థాయికి వచ్చారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా, సింగర్‌గా కూడా తన ప్రతిభ చాటారు.

ఇటీవల విడుదలైన విలాయత్ బుద్ధాలో ఆయన నటనకు మంచి స్పందన వచ్చినా, కొందరు ఈ సినిమాపై పుష్ప సినిమాతో పోలికలు చూపిస్తూ అనవసరంగా ట్రోల్ చేస్తున్నారు.

“నా కొడుకును కావాలనే టార్గెట్ చేస్తున్నారు” — మల్లికా సుకుమారన్

ఈ విమర్శలపై స్పందించిన మల్లికా సుకుమారన్ కఠినంగా మాట్లాడుతూ—

కొంతమంది కలిసి పృథ్వీరాజ్ కెరీర్‌ను నాశనం చేయడానికి కుట్ర చేస్తున్నారు.

విలాయత్ బుద్ధాను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తున్నారని

ఈ పరిస్థితిలో పృథ్వీకి మద్దతుగా నిలిచిన వారు చాలా తక్కువమందేనని

ఆయన ఎదుగుదలనూ, స్టార్‌డమ్‌నూ సహించలేక ఇలా చేస్తోన్నారని

ఇలాంటి నీచమైన చర్యలు ఊహించలేనివని

ఇవి ఆగకపోతే తానే పోరాటం ఆపనని స్పష్టం చేశారు.

మల్లికా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో భారీ చర్చకు కేంద్రబిందువయ్యాయి.

అసలు పృథ్వీరాజ్‌ను టార్గెట్ చేస్తున్నది ఎవరు?

ఈ ప్రశ్నే ఇప్పుడు మలయాళ, దక్షిణాది సినిమా సర్కిల్స్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.


Recent Random Post: