
స్టార్ హీరోలు సాధారణంగా తమ ల్యాండ్‌మార్క్ చిత్రాలను ఎంతో ప్రత్యేకంగా ప్లాన్ చేసుకుంటారు. 25వ సినిమా, 50వ సినిమా, 75వ సినిమా, 100వ సినిమా — ఇలా ప్రతీ మైలురాయిని ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటారు. ఈ విషయంలో ఎక్కడా రాజీ పడరు. అవసరమైతే దానికి తగ్గ కాంబినేషన్ కోసం సమయం కేటాయించడానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఈ క్రమంలో కొంత నష్టం వచ్చినా, ల్యాండ్‌మార్క్ సినిమాకు ఉన్న ప్రాధాన్యం వల్ల దాన్ని పెద్దగా పరిగణించరు. పాన్ ఇండియా స్టార్లు అయితే మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా తన 25వ చిత్రాన్ని అలాంటి స్పెషల్ ప్లాన్‌తో సిద్ధం చేసుకున్నాడు. అది కచ్చితంగా బ్లాక్‌బస్టర్ కావాలనే ఉద్దేశంతో దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగాను ఎంపిక చేసుకున్నాడు. ఈ కాంబోలో తెరకెక్కే చిత్రం ‘స్పిరిట్’ అవ్వాలి.
అయితే, ‘స్పిరిట్’ స్థానంలో ‘పౌజీ’ రానుంది. 24వ చిత్రంగా ‘ద రాజాసాబ్’ సెట్స్ పై ఉండగా, 25వ చిత్రంగా హనూ రాఘవపూడి దర్శకత్వంలో ‘పౌజీ’ పట్టాలెక్కింది. నిజానికి, ‘పౌజీ’ ప్రభాస్ లిస్ట్‌లో కూడా లేదు. రాజాసాబ్ షూటింగ్ జరుగుతుండగా, హనూ రాఘవపూడి అనుకోకుండా ప్రభాస్‌కు ‘పౌజీ’ కథ వినిపించగా, అది అతనికి బాగా నచ్చి వెంటనే ఒకే చెప్పి షూటింగ్ ప్రారంభించేశారు. దాంతో ‘స్పిరిట్’ వెనక్కి వెళ్లిపోయింది.
ఇంకో ముఖ్యమైన కారణం కూడా ఉంది. ‘స్పిరిట్’ చేస్తుంటే, ప్రభాస్ ఇంకో సినిమా చేయకూడదని సందీప్ రెడ్డి షరతు పెట్టాడు. కానీ అప్పటికే ‘రాజాసాబ్’ ఉండటంతో ప్రభాస్ అది అంగీకరించలేకపోయాడు. అందుకే 25వ చిత్రంగా ‘పౌజీ’ వచ్చింది, 26వ సినిమాగా ‘స్పిరిట్’ మారింది. ఇదీ మొత్తం కథ.
Recent Random Post:















