
రెబల్ స్టార్ ప్రభాస్ సెంటిమెంట్ మళ్లీ వర్క్ అవుతోందన్న మాట. ఏ సినిమా ట్రైలర్ లేదా టీజర్ ప్రభాస్ చేతుల మీదుగా రిలీజ్ అయితే ఆ సినిమా హిట్ అవుతుందనే టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే జాతిరత్నాలు, కాంతారా చాప్టర్ 1, మిరాయ్, శంభాల సినిమాల ట్రైలర్స్ ప్రభాస్ రిలీజ్ చేయడం, ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధించడం ఈ సెంటిమెంట్‌ను మరింత బలపరుస్తోంది.
ఇక తాజాగా దుల్కర్ సల్మాన్ నటించిన కాంతా ట్రైలర్‌ను కూడా ప్రభాస్ రిలీజ్ చేశారు. ప్రభాస్ చేయి పడితే సినిమా హిట్టే అన్న నమ్మకంతో ఇప్పుడు చాలా సినిమా టీమ్స్ తమ ట్రైలర్ లాంచ్ కోసం ప్రభాస్‌ను కోరుకుంటున్నారు. పాన్ ఇండియా స్టార్‌గా ఉన్న ఆయన సింప్లిసిటీ, కూల్ అటిట్యూడ్ ప్రేక్షకులకు ఎంత ఇష్టం, ఇండస్ట్రీకి ఆయన ఇచ్చే సపోర్ట్ అంత బలంగా ఉంది.
ప్రభాస్ సెంటిమెంట్ నిజంగానే వర్క్ అవుతుందా లేదా అనేది రాబోయే కాంతా రిలీజ్‌తో తేలిపోనుంది. కానీ ఇప్పటివరకు ఆయన చేతుల మీదుగా రిలీజ్ అయిన సినిమాలు హిట్ కావడంతో, “రెబల్ చేయి పడితే హిట్టే!” అన్న మాట టాలీవుడ్లో రిపీట్ అవుతోంది.
Recent Random Post:














