ఇండియాలో అత్యధిక మార్కెట్ ఉన్న స్టార్ గా డార్లింగ్ ప్రభాస్ దూసుకుపోతున్నాడు. అతని ఫ్లాప్ సినిమా కూడా ఈజీగా 300 కోట్లకి పైగా కలెక్షన్స్ ని అందుకుంటుంది. ఇక హిట్ పడితే 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకోవడం గ్యారెంటీ అని రీసెంట్ గా వచ్చిన ‘కల్కి 2898ఏడీ’ ప్రూవ్ చేసింది. ఈ సినిమా ఏకంగా 1150 కోట్ల కలెక్షన్స్ ని వరల్డ్ వైడ్ గా అందుకుంది. దీనికంటే ముందు వచ్చిన ‘సలార్’ మూవీ ఏవరేజ్ టాక్ తోనే 700 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.
సినిమా సినిమాకి డిఫరెంట్ కంటెంట్ తో ప్రేక్షకులని అలరించడంలో ప్రభాస్ ముందు వరుసలో ఉన్నారు. ‘బాహుబలి’ నుంచి ‘కల్కి’ వరకు ఆయన సినిమాలు ఏ రెండు ఒకేలాంటి జోనర్స్ లో లేవు. ప్రస్తుతం చేతిలో ఉన్న ఐదు సినిమాలు కూడా డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్నవే కావడం విశేషం. నార్త్ అమెరికా లో 15+ మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ని రెండు సార్లు అందుకొని ప్రభాస్ అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నాడు.
‘బాహుబలి 2’, ‘కల్కి 2898ఏడీ’ మూవీస్ నార్త్ అమెరికాలో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న ఇండియన్ సినిమాలుగా ఉన్నాయి. ‘సలార్’ మూవీ కూడా 9 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ని నార్త్ లో వసూళ్లు చేసింది. ‘కల్కి’ మూవీ తర్వాత నార్త్ అమెరికాలో కూడా ప్రభాస్ మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. ఆయన నెక్స్ట్ సినిమాల రైట్స్ కి విపరీతమైన డిమాండ్ ఉంది. ‘కల్కి 2898ఏడీ’ మూవీ 18.57 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసింది.
ఈ ప్రభావం ప్రభాస్ నుంచి రాబోయే ‘ది రాజాసాబ్’ సినిమా పైన కూడా ఉంది. ఈ సినిమా నార్త్ అమెరికా రైట్స్ కోసం 80 కోట్లు ఇవ్వడానికి డిస్టిబ్యూటర్స్ ముందుకొస్తున్నారు. అలాగే హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఫౌజీ’ కి కూడా భారీగా ఆఫర్స్ వస్తున్నాయి. అయితే మేకర్స్ మాత్రం ఈ సినిమాల కోసం 100 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారంట. సినిమా కంటెంట్ బాగుంటే చాలా ఈజీగా 100 కోట్ల కలెక్షన్స్ ని నార్త్ అమెరికాలో ప్రభాస్ అందుకోగలడని మేకర్స్ నమ్ముతున్నారు. అలాగే వారి సినిమాలపై ఉన్న నమ్మకంతో భారీగా కోట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే 100 కోట్లు కాకపోయిన 90 కోట్ల వరకు ఫైనల్ గా నార్త్ అమెరికా రైట్స్ ఫిక్స్ అవ్వొచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రభాస్ నుంచి నెక్స్ట్ రాబోయే ఐదు సినిమాలలో ‘స్పిరిట్’, ‘కల్కి 2898ఏడీ పార్ట్ 2’, ‘సలార్ 2’ చిత్రాలు కచ్చితంగా 1000 కోట్లకి పైగా కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
https://www.tupaki.com/entertainment/prabhas-films-demand-in-overseas-1390553
Recent Random Post: