
తమిళంతో పాటు తెలుగులోనూ భారీ క్రేజ్ సంపాదించుకున్న హీరో కార్తీ ప్రస్తుతం తన కెరీర్‌లో ఓ ఆసక్తికరమైన దశను ఎదుర్కొంటున్నారు. ఒకవైపు భారీ విజయాలు అందుకుంటూనే, మరోవైపు కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా కొడుతుండటం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రతి కొన్ని సంవత్సరాలకు ఒక సాలిడ్ హిట్ దక్కుతున్నప్పటికీ, మధ్యలో వచ్చే భారీ బడ్జెట్ చిత్రాలు మాత్రం అంచనాలను అందుకోలేకపోతున్నాయి.
కార్తీ కెరీర్‌లో ప్రయోగాలు చేయడం కొత్త కాదు. కానీ ఇటీవలి కాలంలో ఆ ప్రయోగాలే ఆయనకు ప్రతికూలంగా మారుతున్నాయి. 2019లో వచ్చిన దేవ్ సినిమాను సుమారు 55 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించగా, అది కేవలం 12 కోట్ల వసూళ్లతో ఫుల్ డిజాస్టర్‌గా మిగిలింది. అలాగే 2023లో భారీ అంచనాల మధ్య విడుదలైన జపాన్ పరిస్థితి మరింత నిరాశ కలిగించింది. దాదాపు 80 కోట్ల వ్యయంతో రూపొందిన ఈ చిత్రం 26 కోట్లకే పరిమితమైంది. తాజాగా వచ్చిన వా వాతియార్ కూడా ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. కథా ఎంపికలో వైవిధ్యం కోరుకుంటున్నప్పటికీ, సామాన్య ప్రేక్షకుడిని ఆకట్టుకోలేకపోవడం కార్తీ మార్కెట్‌పై ప్రభావం చూపుతోందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అయితే కార్తీ కెరీర్‌ను గమనిస్తే ఓ ఆసక్తికరమైన సెంటిమెంట్ స్పష్టంగా కనిపిస్తుంది. వరుసగా కొన్ని ప్లాపులు ఎదురైన ప్రతిసారీ, సరిగ్గా మూడేళ్లకు ఒక భారీ బ్లాక్‌బస్టర్‌తో తిరిగి పుంజుకోవడం ఆయన ప్రత్యేకతగా మారింది. కాష్మోరా, కాట్రు వెలియిడై వంటి ఫ్లాపుల తర్వాత ఖైదీతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే దేవ్ తర్వాత సర్దార్, పొన్నియిన్ సెల్వన్ వంటి చిత్రాలతో తన మార్కెట్‌ను మరింత బలపరిచారు. అంటే కార్తీ పడిపోయిన ప్రతిసారీ మరింత శక్తివంతంగా తిరిగి లేస్తున్నారు.
ఇప్పుడు జపాన్, వా వాతియార్ పరాజయాల తర్వాత ఆయన మళ్లీ తన స్ట్రాంగ్ జోన్ అయిన కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలపై ఫోకస్ పెట్టాల్సిన సమయం వచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే కార్తీ కేవలం మాస్ హీరో మాత్రమే కాదు, అసాధారణమైన నటుడు కూడా. కొన్ని సినిమాలు కథలోని లోపాలు లేదా అతిగా చేసిన ప్రయోగాల వల్ల ఆడకపోయినా, ఆయన నటనపై మాత్రం ఎలాంటి సందేహం లేదు.
ప్రస్తుతం కార్తీ చేతిలో ఖైదీ 2, సర్దార్ 2 వంటి భారీ అంచనాలున్న ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవి ఆయన కెరీర్‌ను మళ్లీ సరైన ట్రాక్‌పైకి తీసుకువస్తాయని ట్రేడ్ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి. వైవిధ్యాన్ని కోరుకుంటూనే కమర్షియల్ అంశాలను సమతుల్యం చేస్తే, కార్తీ బాక్సాఫీస్ వద్ద తన విజయయాత్రను మళ్లీ కొనసాగించడం ఖాయమే.
Recent Random Post:















