ఫహాద్ ఫాజిల్‌తో వరుస సినిమాలు చేస్తున్న ఆర్కా మీడియా వర్క్స్

Share


మాలీవుడ్‌లో ఫహాద్ ఫాజిల్ ఎంత పెద్ద నటుడు అన్నది చెప్పాల్సిన పనిలేదు. నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. విలక్షణమైన నటనతో ప్రేక్షకులను అలరించడం ఫహాద్ ప్రత్యేకత. పాజిటివ్ రోల్ అయినా, నెగటివ్ రోల్ అయినా – అతనికి త‌నదైన ముద్ర ఉంటుంది. ‘పుష్ప’లో బన్వర్ సింగ్ షెకావత్ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యాడు. ఆ పాత్ర రెండు భాగాల్లోనూ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అప్పటి నుంచి “షెకావత్” అనే పేరు ఫహాద్‌కు మరో గుర్తింపుగా మారిపోయింది.

పాన్‌ ఇండియాలో గుర్తింపు రావడంతో, ఇతర భాషల్లో కూడా వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు కోలీవుడ్‌లో ఫహాద్ డిమాండ్ పెరిగిపోయింది. తెలుగులో కూడా చాలానే అవకాశాలు వచ్చాయి. అయితే ఫహాద్ పాత్రల విషయంలో చాలా సెలెక్టివ్‌గా వ్యవహరిస్తాడు. కథ, పాత్ర నచ్చితేనే అంగీకరిస్తాడు. ప్రస్తుతం ఆయన **తెలుగు చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’**లో నటిస్తున్నాడు.

ఇక ‘బాహుబలి’ వంటి పాన్‌ఇండియా చిత్రాన్ని నిర్మించిన ఆర్కా మీడియా వర్క్స్ కూడా ఫహాద్‌తో ఓ భారీ సినిమాను నిర్మిస్తోంది. ఈ చిత్రం ఇటీవలే పటాలెక్కగా, ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే ఆ సినిమాకు సంబంధించిన వివరాలు ఇంకా రహస్యంగానే ఉన్నాయి. ఆర్కా సంస్థ బాహుబలి సమయంలోలా ఈ ప్రాజెక్ట్‌ విషయంలో కూడా గోప్యతను పాటిస్తోంది.

అంతేకాక, ఈ సినిమా తర్వాత కూడా ఫహాద్ ప్రధాన పాత్రలో మరో చిత్రాన్ని నిర్మించనున్నట్లు నిర్మాత శోభు యార్లగడ్డ ప్రకటించారు. అయితే ఆ చిత్ర దర్శకుడు ఎవరు అన్నది మాత్రం వెల్లడించలేదు. ఈ విధంగా ఆర్కా మీడియా వర్క్స్ వరుసగా ఫహాద్ ఫాజిల్‌తో రెండు సినిమాలు చేయడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.

తెలుగులో అనేకమంది ప్రతిభావంతులైన నటులు ఉన్నప్పటికీ, ఆర్కా వంటి ప్రముఖ సంస్థలు ఇతర భాషా నటులకు అవకాశాలు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. అంతేకాదు, మైత్రీ మూవీ మేకర్స్ వంటి సంస్థలు కూడా స్థానిక హీరోలను పక్కనబెట్టి ఇతర భాషా నటులను ప్రోత్సహించడం ఫిలిం సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది.


Recent Random Post: