వరుస ప్లాప్స్ తో సతమతమవుతున్న రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాకి ఫైటర్ లేదా లైగర్ అనే టైటిల్స్ ని పరిశీలనలో ఉంచారు. భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా ఫిలింగా రూపొందిస్తున్న ఈ సినిమాని 5 భాషల్లో రిలీజ్ చేయనున్నారు. సూపర్ స్పీడ్ గా సినిమాలు చేయగల సత్తా ఉన్న పూరి జగన్నాధ్ ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ని 50% ఫినిష్ చేసాడు.
అలాగే ఈ సినిమాని జులై ఎండ్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు.. కానీ అనుకోకుండా వచ్చిన లాక్ డౌన్ వలన ఈ సినిమా ఎప్పుడు మళ్ళీ సెట్స్ పైకి వెళ్లి రిలీజ్ అవుతుందో అనేది ప్రశ్నార్థకంగా మారింది.
కానీ విజయ్ దేవరకొండ ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా రిలీజ్ విషయంపై మాట్లాడారు. ‘ఫైటర్ సినిమా 50% షూటింగ్ అయ్యింది. వచ్చే ఏడాదే(2021) ఈ సినిమా రిలీజ్ ఉంటుంది. ఇది పాన్ ఇండియా ఫిల్మ్, ప్రతి ఒక్కరూ ఈ సినిమాని థియేటర్ కి వచ్చి ఎంజాయ్ చెయ్యాలనేది నా కోరిక.. సో అన్నీ సెట్ అయ్యాక, థియేటర్స్ చూసుకొని రిలీజ్ చేయాలి. అలాగే ఫైటర్ అనేది యాక్షన్ నేపథ్యంలో సాగే ఫిల్మ్. పూర్తిగా బాక్సింగ్ బేస్డ్ ఫిలిం కాదు, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ సినిమాలా దీన్ని చూడచ్చు. 6 ప్యాక్ ట్రై చేస్తున్నా, కానీ ఎంత వరకూ నా బాడీ దానికి సహకరిస్తుందో చూడాలని’ విజయ్ దేవరకొండ తెలిపారు.
బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని పూరి కనెక్ట్స్ మరియు కరణ్ జోహార్ కలిసి నిర్మిస్తున్నారు.
Recent Random Post: