
నటసింహ బాలకృష్ణ నటించిన పాత్రల్లో వైవిధ్యం ఎంతగానో కనిపించినా, ఆయన శారీరకంగా పాత్ర కోసం పూర్తిగా మారిన సందర్భాలు చాలా తక్కువ. ఇప్పటి వరకు ఏ పాత్రకైనా తాను ఉన్న రూపంతోనే న్యాయం చేసిన బాలయ్య, ఇప్పుడొక సరికొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నారు.
ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కబోయే కొత్త సినిమాలో బాలయ్య పూర్తిగా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వబోతున్నారట. ప్రత్యేకమైన డైట్ ఫాలో అవుతూ, జిమ్‌లో కసరత్తులు చేస్తూ స్లిమ్ లుక్ కోసం మేకోవర్ మొదలుపెట్టారు. అంతేకాదు, లుక్ పరంగా కూడా బాలయ్యలో గణనీయమైన మార్పులు కనిపించనున్నాయట. ఈ సినిమాకు ప్రత్యేకమైన హెయిర్ స్టైలిస్ట్‌ను కూడా విదేశాల నుండి రప్పిస్తున్నారట.
ఇదే సమయంలో అఖండ 2 షూటింగ్ పూర్తి చేసిన తర్వాతే బాలయ్య ఈ స్లిమ్ లుక్‌తో స్క్రీన్ మీద కనపడనున్నారన్న సమాచారం. అఖండ 2లో మాత్రం ఆయని ఇప్పటివరకూ ఉన్న రూపంతోనే కనిపిస్తారు. స్లిమ్ లుక్ మాత్రం కొత్త సినిమాకే స్పెషల్గా సిద్ధం చేస్తున్నారు.
నాగార్జున, వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలు ఎప్పుడూ ఫిట్‌నెస్‌తో ఆకట్టుకుంటున్న సమయంలో, చిరంజీవి కూడా విశ్వంభర కోసం ట్రిమ్ అవ్వడం తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో బాలయ్య కూడా స్లిమ్ లుక్‌ను స్వీకరిస్తుండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ. త్వరలోనే బాలయ్య వర్కౌట్ వీడియోలు బయటకి వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.
ఈ మార్పులు చూస్తుంటే, బాలయ్య తన తదుపరి సినిమాతో మరోసారి ప్రేక్షకుల హృదయాలను దోచేందుకు రెడీ అవుతున్నారని చెప్పడంలో సందేహమే లేదు.
Recent Random Post:















